Pakistan votes amid bomb blasts in karachi

bomb blasts in karachi, twin blasts in karachi pakistan votes amid bomb blasts in karachi, polls in pakistan

Pakistan Votes Amid Bomb Blasts In Karachi

పాక్ ఎన్నికల్లో హింస...? పేలిన బాంబులు

Posted: 05/11/2013 06:35 PM IST
Pakistan votes amid bomb blasts in karachi

కరాచీలో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అవామి నేషనల్ పార్టీ ఆఫీసు దగ్గర బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. వెంటనే అధికారులు అక్కడకు చేరకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పాకిస్థాన్‌లో ఎన్నికల సందర్భంగా ప్రజలు ఓటు వేయడానికి వస్తున్న తరుణంలో బాంబు పేలుడు ఘటన జరగడంతో వారు భయాందళనకు గురవుతున్నారు.. అయినా, ఓట్లు వేయడానికి ప్రజలు పెద్ద యెత్తున వీధుల్లోకి వచ్చారు. వేడి దంచికొడుతున్నా ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. ఎన్నికల ద్వారా దేశంలో సంపూర్ణమైన మార్పులు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీంతో ఓటు వేయడానికి వారు పెద్ద యెత్తున ముందుకు వచ్చారు. బెలూచిస్తాన్‌లోని సోరబ్ పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద సాయుధులు ఇద్దరిని కాల్చి చంపారు. బెలూచిస్తాన్‌లోని చమన్ పట్టణంలో ఇద్దరు అభ్యర్థుల అనుచరులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మరణించారు. ఎన్నికలకు ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles