Increase in foreign tourists reports chiranjeevi

foreign tourists, dept of tourism, tourism minister, chiranjeevi, increased tourism revenue

increase in foreign tourists reports chiranjeevi

foreign-visitors.png

Posted: 04/03/2013 05:13 PM IST
Increase in foreign tourists reports chiranjeevi

chiranjeevi-photo

కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగటం వాస్తవమే కానీ, విదేశీ పర్యటకుల సంఖ్య గత రెండు నెలలుగా రెండు శాతం పెరిగిందని కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి అన్నారు. అవాంఛనీయమైన సంఘటనలు, విదేశీ పర్యటకుల పట్ల జరిగిన దురదృష్టకరమైన సంఘటనల వలన మనదేశాన్ని సందర్శించే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిపోవచ్చని మీడియాలో కథనాలు వచ్చాయి కానీ, నిజానికి అలాంటిదేమీ జరగలేదు. జనవరి ఫిబ్రవరి నెలల్లో భారతదేశాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య ప్రోత్సాహకరంగా ఉంది కానీ మీడియా భయపడ్డట్టుగా నష్టపోలేదన్నారాయన.

విదేశీ పర్యాటకుల వలన భారతదేశానికి వచ్చిన ఆదాయం భారత దేశ కరెన్సీలో చూసుకుంటే 19.8, అమెరికన్ డాలర్లలో చూస్తే 11.4 శాతం పెరిగిందని కూడా చిరంజీవి వివరించారు.

పోయిన నెలలో 39 సంవత్సరాల స్విస్ యువతి మధ్య ప్రదేశ్ లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆగ్రాలో బ్రిటిష్ యువతి హోటల్ బాల్కనీలోంచి దూకి తననుతాను రక్షించుకునే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలించుకుంది. ఢిల్లీలో బస్ లో వైద్యవిద్యార్థిని మీద ఘాతుకమైన సామూహిక అత్యాచారం దేశ విదేశాలలో సంచలనాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో విదేశీయులు భారత్ లోకి పర్యటనలకు రావటానికి జంకుతారేమోనన్న భయాన్ని పలువురు వెలిబుచ్చారు, దాన్ని మీడియా కూడా సమర్థించింది.

కానీ, భారత దేశ ప్రజల మీద, ప్రభుత్వం మీద, శాంతి భద్రతల సంస్థలమీద ఇంకా నమ్మకం ఉన్న విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనలను కొనసాగిస్తున్నారు. అందుకు చిరంజీవి కూడా సంతోషాన్ని వ్యక్తం చేసారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles