Gutka ban implementation asked by sc

supreme court of india, gutka and pan masala ban, central govt, state govt, union territories, gutka ban implementation

gutka ban implementation asked by sc

gutka.png

Posted: 04/03/2013 04:26 PM IST
Gutka ban implementation asked by sc

 

gutka-and-panmasala

మింగేసి దాని గురించి మర్చిపోవటమే గుటకాయస్వాహా అంటే.

 

మద్యపానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసినా, బహిరంగ స్థలాల్లో ధూమపానాన్ని, గుట్కాలను మొత్తానికే వాడవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ఎంతవరకు అమలు లో ఉన్నాయో మనకి కనిపిస్తూనే వుంది. గుట్కాలు, పొగాకు తో కూడిన పాన్ మసాలాల వినియోగం, తయారీల బహిష్కరణ ఎంత వరకు అమలులోకి వచ్చిందో తెలియజేయమని సుప్రీం కోర్టు రాష్ట్రాల, యూనియన్ టెరిటరీల ఆరోగ్య శాఖ సెక్రటరీలను ఆదేశించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో గుట్కా వినియోగం, ఉత్పత్తులు జరుగుతున్నాయని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి చేసిన ఫిర్యాదు దృష్ట్యా, జస్టిస్ జి.ఎస్.సంఘ్వి నేతృత్వంలో ధర్మాసనం ఈ రోజు 23 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు బహిష్కరణ అమలు గురించి భోగట్టాల అఫిడవిట్ లను సమర్పించమని అడిగింది.

ఆ మూడు రాష్ట్రాల్లో బహిష్కరణ అమలు జరగటం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటానికి పూర్వం ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో గుట్కా పాన్ మసాలాల వినియోగాలు, ఉత్పత్తుల మీద విధించిన బహిష్కరణను గట్టిగా అమలు పరచమని ప్రభుత్వానికి గట్టిగా చెప్పమని కోరగా, సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అందుకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల పేర్లు చెప్తూ, అక్కడ మాత్రం సరిగ్గా అమలు జరగటం లేదని పేర్కొంది. ఆ మూడు రాష్ట్రాలు యుపిఏ నియంత్రణలో లేని రాష్ట్రాలు.

అయితే ఆ మూడు రాష్ట్రాలకే కాకుండా అన్ని రాష్ట్రాలనూ వివరణ కోరుతూ- అది కూడా అఫిడవిట్ రూపంలో, మే 3 వరకూ సుప్రీం కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Palwai alleges komatireddy brothers
Increase in foreign tourists reports chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles