Aug 30 | చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని పెళ్లి చేసుకునే యువకులకు మాత్రం ముందస్తు సెక్స్ అనుభవం ఉండక పోవచ్చు.కానీ, తమలో సెక్స్ కోర్కెలు కలిగినపుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలాంటి యువకులకు కొన్ని రకాల సందేహాలు వస్తుంటాయి. ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న వితంతువులు, మహిళలను పెళ్లి చేసుకుంటే వారిని సంతృప్తి పరచగలమా లేదా అనేది వారిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి సందేహాలకు నివృత్తి ఎలా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే..సాధారణంగా మనస్సుకు నచ్చిన యువతి లేదా మహిళను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. అలా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారిలో సెక్స్ కోర్కెలు ఉన్నాయా లేదా అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది.అలాగే, ఏ యువతీ అంగ పరిమాణం గురించి పట్టించుకోదు. సెక్స్ అనుభవం లేని యువతి అయినా.. అనుభవం ఉన్న మహిళ అయినా సరే వారికి కావాల్సింది సమర్థవంతంగా సెక్స్‌లో పాల్గొనడమే. పురుషుడిలో ఆ తరహా సామర్థ్యం ఉంటే ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న మహిళలను వివాహం చేసుకోవడంలో తప్పులేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.Read More
Jul 17 | సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరిస్తుంది. మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ. పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి.ఇలాంటి అవకాశం ఇవ్వనందున మగవాడు సెక్స్ కోసం పడే హడావుడి, ఆడవారు సెక్స్ అంటే ఉండే భయం, గర్భం వస్తుందేమోనన్న ఆందోళన, మరోవైపు సినిమాలు, నవలల్లోలాగా తొలిరాత్రి నాడే ఆ అనుభవం తప్పక చూడాలని యత్నం చేసి చివరికి గందరగోళమవుతుంది. దాంతో మధురమైన రాత్రిగా మిగలాల్సిన అనుభవం పీడకల అవుతుంది. కాబట్టి మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా ఉండటం మంచిది. ఇద్దరూ తమ ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు సరిగా అర్థం చేసుకుని ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత లైంగికంగా కలిస్తే తొలిరాత్రి మరపురానిది అవుతుంది.Read More
Jul 09 | పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఇపుడు ఏ జంటా సిద్ధంగా ఉండటం లేదు. వివాహం కానించిన తర్వాత జీవితాన్ని కాస్తంత హ్యాపీగా కొన్నాళ్లపాటు స్వేచ్ఛగా అనుభవించాలని కోరుకుంటున్నారు.అలా కొన్నాళ్లపాటు పిల్లల్లేకుండా ఉండాలంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కొత్త జంటల్లో అనేక అనుమానాలు, అపోహలు గూడుకట్టుకుని ఉంటాయి. అటువంటి వారికి సెక్సాలజిస్టులు ఈ క్రింది సలహాలు చెపుతున్నారు.స్త్రీతో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదు. మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు.ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యేవారికి మాత్రమే. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30 రోజులకు, ఇంకొందరు35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం రతిలో పాల్గొనాలి. ప్రతి నెలా కరెక్ట్‌గా ఒకే రోజుకి మెన్సస్ కానివారు మెన్సస్ అయిన మొదటి రోజులకంటే, మెన్సస్‌కు ముందు 11 రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే వారికది సేఫ్ పీరియడ్‌గా భావించవచ్చు.Read More
Jul 05 | కుచాలా మంది యువతీ యువకుల విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు వెసులుబాటు ఉండదు. అలాంటి సమయాల్లో భార్య సెక్స్ కోరుకుంటుందని అలాగే, భర్త రతి కోసం ఆరాట పడుతున్నట్టు గుర్తించడం ఎలా? అనే సందేహం చాలా మంది యువతీ యువకుల్లో ఉంటుంది. ఈ అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే.... ఇలాంటి సందేహాలు లైంగిక విజ్ఞానం లేని యువతీ యువకుల్లో వస్తుంటాయన్నారు. ఇలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే యువతీ యువకులు తమలో లైంగిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు వీలుగా శృంగార పుస్తకాలు చదవాలని సలహా ఇస్తున్నారు. లైంగిక విజ్ఞానం కోసం సెక్స్ పుస్తకాలను చదవడంలో ఎలాంటి తప్పు లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిలో లైంగిక కోర్కెలు అనేవి సహజసిద్ధంగా వచ్చేవన్నారు. ఇవి స్త్రీపురుషులిద్దరికీ కలుగుతుంటాయి. యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి జీవితకాలం ఈ కోర్కెలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడంలో తప్పు లేదు. ముఖ్యంగా భార్యతో కలిసి ఆనందించడమే సక్రమమైన మార్గం. అయితే, సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు భార్యతో గడిపే సమయమే అత్యంత కీలకం. సెక్స్ చేసే విషయంలో పురుషులకు ఆదుర్దా ఉంటే శీఘ్రస్కలనం అవుతుంది. అలాగే, ఆడవారికి భయం ఉంటే సెక్స్ బాధాకరంగా ఉంటుంది. అందువల్ల భార్యాభార్తలు సెక్స్‌లో పాల్గొనే ముందు ఎంత ఎక్కువ సేపు గడిపితే అంత మంచిది. అలాగే, భార్యకు సెక్స్‌పై ఆసక్తి ఉందో పురుషుడు గ్రహించి నడుచుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Read More
Jul 05 | అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవి. శృంగారం..... భౌతిక జీవితంలో అత్యంత కీలకమైనదీ ఇదే. ఎంతోమంది అత్యంత రహస్యంగా ఉంచుకునేదీ ఇదే. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడు ఎవరికీ ఏమీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. కానీ, ఒక సమస్య మొదలైనప్పుడు, ఒక లోపం కాల్చివేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా? మొత్తం జీవితాన్నే నిర్జీవంగా మార్చివేసే అతిపెద లైంగిక లోపాన్ని అతి రహస్యంగా ఉంచుకుంటే ఏమవుతుంది? అసలు జీవించి ఉన్నామో లేదో తెలీకుండాపోతుంది. 1995లో ప్రపంచ వ్యాప్తంగా 152 మిలియన్ల మంది ఈ అంగస్థంభన లోపాలతో బాధపడినట్లు అధ్యనాల్లో తేలింది. ఈ క్రమంలో 2025 నాటికి వీరి సంఖ్య 322 మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడతారన్నది ఒక అంచనా. ఈ పరిణామాలు ఇంతతీవ్రంగా పెరగుతూ పోతే, మానవ సంతతే మరుగయ్యే పరిస్థితి.అంగస్థంభన లోపాలు కొందరిలో పాక్షికంగా ఉంటే మరికొందరిలో పూర్తిస్థాయిలో ఉంటాయి. కొందరిలో అతి స్వల్పం కాలం ఉండిపోయే అంగస్థంభనలూ ఉంటాయి. మొత్తంగా చూస్తూ ప్రతి ఇద్దరిలో ఒకరు అంగస్థంభన లోపాలతో సతమతమవుతున్నారు. మధుమేహ పీడితుల్లో కూడా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రోజూ ఒక పాకెట్ సిగరెట్లు తాగే వారిలో దాదాపు 50 శాత మంది అంగస్తంభనలోపాలతో బాదపడుతున్నవారే. 40 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం దాకా ఈ సమస్య ఉంది. వాస్తవికంగా ఇంత పెద్ద శాతం మంది ఈ సమస్యతో బాదపడుతున్నా, వారిలో అత్యంత స్వల్ప సంఖ్యలోనే వైద్యచికిత్సలకు వెళుతున్నారు. స్తంభనా లోపం ఇద్దరి సమస్య లైంగిక ప్రక్రియలో అత్యధిక శాతం పురుషులు ఎదుర్కొనే సమస్య అంగస్తంభన లోపం. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వారిలోనే ఉంటుందని భావించేవారు. కానీ, ఇప్పుడది అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ఎవరో ఎందుకు? కొత్తగా పెళ్లయిన వాళ్లలోనే దాదాపు 40 శాతం మంది అంగస్తంభన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడింది.అంగస్తంభన లోపాలు ప్రారంభంలో అప్పుడో ఇప్పుడో చాలా అరుదుగా వచ్చిపోతుంటాయి. స్తంభనలు ఎలా వస్తాయి? అంగ స్తంభన వ్యవస్థ ఎన్నెన్నో అంశాల మిశ్రణం. ఆలోచనలు, అనుభూతులు, కండరాలు, నరాలు, రక్తం ఇవన్నీ సరియైన రీతిలో పనిచేసినప్పుడే స్తంభనలు పరిపూర్ణంగా ఉంటాయి. శరీరంలోని న్యూరోట్రాన్స్మీటర్లన్నీ సరిగ్గా ఉండి, అవసరమైనంత నైట్రస్ ఆక్సైడ్ అంది, రక్తంలో ఆక్సీజన్ పరిమాణం సరిపడా ఉండి, టెస్టోస్టెరాన్ హార్మోన్లు అవసరమైన మోతాదులో ఉన్నప్పుడే లైంగిక పటుత్వం ఉంటుంది. అంగస్తంభనా లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. 85 శాతం కారణాలు శారీరకమైతే, మిగతా 15 శాతమే మానసిక కారణాలు ఉంటాయి. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవే. ఈ సమస్యలను అధికమించాలంటే డాక్టర్లను కలిసి నిర్భయంగా చెప్పుకొని సంసార జీవితాన్ని ఆస్వాదించండి.Read More