State bank of india arundathi bhattacharya biography

Arundathi Bhattacharya Biography, Arundathi Bhattacharya sbi ceo, SBI, State Bank of India, Forbes, Most Powerful Woman, World list, Arundathi Bhattacharya SBI

State Bank of India Arundathi Bhattacharya biography : she is the first chairperson to the largest public sector bank in India. Arundathi Bhattacharya is named in Forbes Most Powerful Women in The World List with 36th place.

మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన అరుంధతి

Posted: 01/06/2015 02:48 PM IST
State bank of india arundathi bhattacharya biography


ఎంత పెద్ద వర్షమైనా చిన్న చినుకుతోనే మొదలవుతుంది. అలాగే ఎంత పెద్ద పదవైనా కూడా కిందిస్థాయి నుంచే వస్తుంది. ఆడవారు అంటే ఇంటి లెక్కలు చేయగలిగితే చాలు, పెద్ద చదువులు ఎందుకనే వ్యక్తులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. సమాజంలో ప్రతి రంగంలో ఆడవారిపై ఒత్తిడులు ఉన్న నేటి తరుణంలో, ఓ మహిళ ఏకంగా బ్యాంకు చైర్మన్ కావటం అంటే ఆశ్చర్యకరం. అదికూడా ఆషామాషీ బ్యాంకు కాదు దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సీఈఓగా ఎదగటం అంటే మహిళలంతా గర్వించదగ్గ విషయం.

అరుంధతి భట్టాచార్య, ఈ పేరు ఇప్పుడు కేవలం భారత దేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో మార్మోగుతోంది. బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్ గా జీవితం మొదలు పెట్టిన ఓ సాధారణ ఉద్యోగిని ఏకంగా బ్యాంకు చైర్ పర్సన్ గా ఎదగటం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక ఎంతో కృషి, పట్టుదల ఉంది. కింది స్థాయి నుంచి సవాళ్ళు, సమస్యలను ఎదుర్కుంటూ, ఉద్యోగం, కుటుంబ పరంగా వచ్చే ఇబ్బందులను పరిష్కరించుకుంటూ అరుంధతి ఉన్నత శిఖరాలను అందుకుంది. ఈమె జీవితం గురించి ఓ సారి చూస్తే.., కోల్ కతాలో 1956లో అక్టోబర్ 7న జన్మించింది. ఈమె తండ్రి భిలాయ్ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగి కావటంతో, బాల్యమంతా భిలాయ్ లో గడపింది. ఈమె తల్లి హోమియోపతి కన్సల్టెంట్ గా పనిచేసేది. ఆ కాలంలోనే కాస్త స్థిరపడటంతో పాటు, ఉన్నత విద్య తెలిసి ఉండటంతో.., అరుంధతిని కూడా ఉన్నత చదువులు చదివించారు.

అలా తల్లితండ్రుల సహకారంతో చదువుకున్న అరుంధతి.., బ్యాంకు నిర్వహించిన పోటి పరీక్షలు రాసి ఎంపిక అయింది. అలా 1979లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆధునిక భావాలు కలిగి ఉండే అరుంధతి.., బ్యాంకు ఉద్యోగినిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సామాన్యలకు బ్యాంకు సేవలు చేరవేయటంతో పాటు, ఎస్ బీ ఐ అంటే కేవలం నగదు దాచుకునే కేంద్రంగా కాకుండా డబ్బుతో ముడిపడిన ప్రతి వ్యవహారంను నిర్వహించే సంస్థగా మార్చేసింది. ఉత్తమ ప్రతిభ చూపటంతో క్రమంగా ఎదుగుదల మొదలయింది. బ్యాంకింగ్ రంగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కింది. ఫారిన్ ఎక్చ్సేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, మానవ వనరులు, ఇన్వెస్ట్ మెంట్ మార్కెటింగ్ సహా ఇతర శాఖల్లో పనిచేసింది.

36 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో, ఎటీఎం, క్యాపిటల్ మార్కెటంగ్, సహా ఇతర విభాగాలకు సీఈఓగా వ్యవహరించింది. అంతేకాకుండా న్యూ యార్క్ లోని బ్యాంకు కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉంది. ఎస్ బీ ఐ ప్రవేశపెట్టిన జనరల్ ఇన్సూరెన్స్, కస్టోడియల్ సర్వీస్, మాఖ్వైర్ ఇన్ ఫ్రా స్ర్టక్చర్ సహా ఇతర కార్యకలాపాల్లో భాగ్వసామిగా కొనసాగింది. బ్యాంకు ప్రారంభించే ప్రతి కొత్త ప్రాజెక్టులోనూ అరుంధతి భట్టాచార్య భాగస్వామ్యం ఉండేది. ప్రజలు బాగుంటేనే బ్యాంకులు బాగుంటాయి తద్వారా దేశం బాగుపడుతుంది అనే ఆలోచనతో కొత్త పథకాల రూపకల్పనలో ప్రజలకు లాభం కలిగేలా సూచనలు చేసి వాటిని అమలు చేయించింది.

ఉద్యోగ జీవితంలో చూపిన ప్రతిభను, చేసిన సేవల కారణంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సీఈఓగా అరుంధతి భట్టాచార్య ఎంపిక అయింది. ఎస్ బీ ఐ చైర్మన్ గా ఒక మహిళ ఎంపిక కావటం ఇదే తొలిసారి. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటికీ మార్గదర్శకంగా ఉండే ఎస్.బీ.ఐ.ని ఇవాళ ఓ మహిళ

ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించి ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాలో 36వ స్థానంలో నిలిచింది. అరుంధతి జీవితం దేశ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arundathi Bhattacharya  SBI  Forbes  

Other Articles