Tanguturi suryakumari biography famous actresses singer

Tanguturi Suryakumari news, Tanguturi Suryakumari birthday special, Tanguturi Suryakumari photos, Tanguturi Suryakumari life story, Tanguturi Suryakumari life history, Tanguturi Suryakumari story, Tanguturi Suryakumari wikipedia, Tanguturi Suryakumari wiki, Tanguturi Suryakumari biography, Tanguturi Suryakumari husband, Tanguturi Suryakumari death day, Tanguturi Suryakumari family members

Tanguturi Suryakumari biography famous actresses singer

మధురమైన గానంతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసిన తెలుగు నటి

Posted: 11/13/2014 02:51 PM IST
Tanguturi suryakumari biography famous actresses singer

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో వున్న తారలందరికీ ఇతర ప్రాంతాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారుగానీ.. గతంలో మాత్రం తెలుగువారే ఎక్కువమంది వున్నారు. వాళ్లు తమ నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే గాక.. ఇతర రంగాల్లో సైతం తమకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న తారలు ఎంతోమంది వున్నారు. అటువంటివారందరిలో టంగుటూరి సూర్యకుమారి కూడా ఒకరు! ఈమె ఒక మంచి నటిగా పేరు సంపాదించుకోవడంతోపాటు ప్రసిద్ధ గాయకురాలిగా ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుంది.

జీవిత విశేషాలు :

1925 నవంబర్ 13వ తేదీన రాజమండ్రిలో జన్మించింది. ఈమె ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడైన టంగుటూరి శ్రీరాములు కుమార్తె. బాల్యం నుంచే ఈమెకు సంగీతంలో ఎక్కువ ఆసక్తి వుండటం వల్ల పాఠశాలల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొని.. అందులో బహుమతులు గెలుచుకునేది. అలాగే పెదనాన్న సభల్లో ప్రార్థన గీతాలు కూడా పాడుతుండేది. అలా ఆ విధంగా సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా వుండటంచేత ఆమెను సినిమావారి నుంచి పిలువువచ్చింది. సంప్రదాయ కుటుంబం కాబట్టి మొదట్లో ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యాయి కానీ.. వాటన్నింటిని ఎదురించి కుమారి సినీ ప్రస్థానంలో ప్రవేశించింది.

పన్నెండేళ్ల ప్రాయంలోనే ‘‘రైతుబిడ్డ’’ సినిమాలో నటించి.. తన నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో మొత్తం 26 సినిమాల్లో నటించింది. అయితే నటికంటే ఈమె గాయనిగానే ఎక్కువ ప్రాధాన్యాన్ని పొందింది. అందరినీ ముగ్ధుల్ని చేసే కంఠస్వరం ఆమె సొంతం కావడంతో ఈమెకు ఎక్కువగా పాటల అవకాశాలే వచ్చేవి. దాంతో ఆమ యాభైదాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో పాటలు పాడింది. అలాగే లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది.

గాయనిగా ప్రస్థానం :

నటిగా ఆమె మంచి పేరు సంపాదించుకున్నా... ఆమె పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడం వల్ల ఎక్కువగా కచ్చేరీలు చేస్తూండేది. నిజానికి ఈమెలో ఆకర్షణీయమైన గుణాలు చాలా వున్నప్పటికీ.. ఇతర అమ్మాయిలకంటే ఎక్కువగా పొడవు వుండటం వల్ల కాస్త సమస్య వుండేది. అలాగే వాళ్లది బ్రాహ్మణ కుటుంబం అదికూడా రాజకీయరంగంలో మంచి పలుకుబడి వున్నవారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆమె సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు, హీరోలతో తనమీద చెయ్యి వేయించుకునేది కాదట. అటువంటి సీన్లను ఆమె తిరస్కరించేదట! అందుకే ఆమె సినీప్రస్థానంలో సుస్థిరమైన స్థానాన్ని పొందుపరుచుకోలేకపోయింది. దాంతో ఆమె తనలో దాగివున్న రెండో కోణాన్ని అంటే సంగీతంతో తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించింది.

ఈమె స్వరానికి ముగ్ధులైన ప్రకాశంపంతులు ఎంతగానో ప్రోత్సహించారు. ఆమెకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవారు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో ‘‘వందేమాతరం’’.., ‘‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’’ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితోపాటు ‘‘స్వప్నజగతిలో ఛాయావీణ’’ మొదలైన లలిత గీతాలు, అడివి బాపిరాజు గారి ‘‘ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ’’.., ‘‘రావోయి చిన్నవాడా’’ మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. స్వాతంత్ర్యోద్యమ సమయములో ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’, ‘‘దేశమును ప్రేమించుమన్నా’’ మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది.

ఇతర విషయాలు :

గాయనిగా, నటిగా ఈమె అందించిన సేవలకుగానూ 1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఆమెను సత్కరించింది. అలాగే 1979లో ‘‘రాజ్యలక్ష్మి అవార్డు’’తో ఈమెను గౌరవించింది. లండనులోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్ తో వివాహమైంది. 1973లో లండనులో స్థిరపడిన ఈమె 2005 ఏప్రిల్ 25 అక్కడే మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanguturi Suryakumari  telugu actresses  tollywood singers  telugu news  

Other Articles