Sridevi most beautiful lady in india

India most beautiful and greatest actress of all-time, Sridevi. Sridevi aka Sreedevi, ruled Indian cinema

India most beautiful and greatest actress of all-time, Sridevi. Sridevi aka Sreedevi, ruled Indian cinema

Sridevi Most Beautiful Lady In India.png

Posted: 03/15/2013 02:44 PM IST
Sridevi most beautiful lady in india

sridevi family

సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల సుందరి శ్రీదేవిలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ మాత్రం వన్నె తగ్గలేదు. పలు భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన శ్రీదేవి ఆగస్టు 13, 1963లో తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. దం, అభినయం, నటన ఉన్న అతికొద్ది మంది కథానాయకురాళ్లల్లో శ్రీదేవి ఒకరు.న్యాయవాది అయ్యప్పన్‌ ఆమె తండ్రి. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి సోదరి శ్రీలత, సోదరుడు సతీష్‌ ఉన్నారు. ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించింది.

కుటుంబం

తల్లి మరణం తరువాత ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన హీరో అనిల్‌ కపూర్‌ సోదరుడయిన బోనీకపూర్‌ను జూన్‌ 2 ,1996న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఝాన్వీ, ఖుషి. ఝాన్వీ ప్రస్తుతం తల్లి వద్ద నటనలో ఓనమాలు నేర్చుకుంటోంది. త్వరలో సినీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఈమెను పరిచయం చేయడానికి ఎంతో మంది డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉన్నారట.

child srideviనట జీవితం

171967లో బాల నటిగా కన్దన్‌ కరుణాయ్‌ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించింది. యువ నటిగా తమిళ, మళయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఆద్యపాదం, ఆలింగనం, కుట్టవుమ్‌ శిక్షయుమ్‌, ఆ నిమషం మళయాళ సినిమాల్లో చెప్పుకోదగ్గవి.1976లో బాలచందర్‌ చిత్రం మూండ్రు ముదచ్చులో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత కమల్‌, రజనీతో కలిసి అనేక సినిమాల్లో నటించారు శ్రీదేవి. 1975-85 మధ్య కాలంలో టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరుతెచ్చుకున్నారు. తెలుగులో తండ్రీకొడుకులైన ఎఎన్‌ఆర్‌, నాగార్జునలతో కలిసి నటించిన ఒకేఒక్క కథానాయిక శ్రీదేవి. శ్రీదేవి చిత్రాలకు ఎక్కువగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

1978లో హిందీ చిత్రం సోల్వా సావన్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రెండవ సినిమా హిమ్మత్వాలా మంచి విజయం తీసుకురావడంతో బాలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగించారు. మిస్టర్‌ ఇండియా చిత్రం ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కధానాయికగా ఎదిగి, అధిక పారితోషికం తీసుకునేవారు.హాలీవుడ్‌లో ప్రఖ్యాతి గాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్‌ స్పీల్బర్గ్‌ ఆమెతో సినిమా తీయాలని భావించాడు. మొన్న ఆస్కార్‌ గెలుచు కున్న లింకన్‌ చిత్ర దర్శకుడు ఈయనే. అప్పటికే పలు చిత్రాల్లో బిజీగా ఉండడంతో అభ్యర్థనను ఆమె తిరస్కరించారు. 1997లో తీసిన జుదాయి తరువాత ఆమె వెండితెరకు దూరమయ్యారు.

సెకండ్‌ ఇన్సింగ్స్‌

ఆరేళ్ల విరామం తరువాత ఆమె సహార ఛానల్‌లో ప్రసారం అయ్యే మాలినీ అయ్యర్‌ అనే సీరీయల్‌లో నటించారు. కరిష్మా కపూర్‌ నిర్వహించే జీనా ఇసికే నామ్‌ అనే కార్యక్రమంలో అతిథిగా కనిపించారు. 2012లో ఇంగ్లీష్‌ వింగ్లీస్‌ చిత్రం ద్వారా మళ్లీ సినీ రంగంలో పునః ప్రవేశం చేశారు. ఈ చిత్రానికి ప్రేకుల వద్ద మంచి మార్కులే పడ్డాయి. త్వరలో బోనీ నిర్మాణంలో మిస్టర్‌ ఇండియా-2 చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

sridevi-1శ్రీదేవికి తల్లితో ఉన్న బంధం ఎక్కువ. అందుకే ఆమె మృతిచెందినప్పుడు శ్రీదేవే అంత్యక్రియలు నిర్వహించి చితికి నిప్పంటించింది. తరువాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఏసియన్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ లో ఒక సభ్యురాలిగా పని చేస్తున్నారు.

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు

1981 మీండుం కోకిల, తమిళ చిత్రం
1989 చాందిని, హిందీ చిత్రం
1989 చాల్‌ బాజ్‌, హిందీ చిత్రం
1991 లమ్హే, హిందీ చిత్రం
1992 క్షణక్షణం, తెలుగు చిత్రం
1992 ఖుదా గవా, హిందీ చిత్రం
1993 గుమ్రా, హిందీ చిత్రం
1994 లాడ్లా, హిందీ చిత్రం
1997 జుదాయి, హిందీ చిత్రం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles