Creative director ekta kapoor interview

Ekta Kapoor Interview, Interview With Ekta Kapoor, Ekta Kapoor, hindi,indian,tamil,telugu,malayalam,bollywood, Ekta Kapoor-bollywood star,

interview with Ekta Kapoor-film related interview with Ekta Kapoor.

Creative director Ekta Kapoor interview.png

Posted: 10/06/2012 03:29 PM IST
Creative director ekta kapoor interview

Ekta_Kapoorఅత్తా-కోడళ్ళ మధ్య జరిగే హాట్‌ హాట్‌ గొడవలను సరికొత్త విధంగా చూపించిన ఏక్తా కపూర్‌ను దేశంలోని మహిళా ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకున్నారు. మకుటం లేని సీరియల్‌ నిర్మాతగా కీర్తించారు. రాగిని ఎం.ఎం.ఎస్ వంటి చిత్రాలు కూడా తీయడంతో మహిళలలు కుటుంబసమేతంగా థియోటర్‌కి తరలి వెళ్లారు. తీరా చిత్రం ప్రారంభమయ్యాక ఇది నిజంగా ఏక్తా తీసిన సినిమానా అని ఆశ్చర్యపోయారు. అలాంటి దర్శక,నిర్మాత ఏక్తా కపూర్ గురించి కొన్ని విషయాలు.

బాల్యం...

ఏక్తా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు జీతేంద్ర కుమార్తె. బాలీవుడ్‌ యువ నటుడు తుషార్‌ కపూర్‌ సోదరి. సాధారణంగా సినిమా తారల సంతానం హీరో, హీరోయిన్‌ కావాలని అసక్తి చూపిస్తుంటారు. కాని ఏక్తా కపూర్‌ మాత్రం వాణిజ్య విలువలున్న టీవి సీరియల్స్‌ను, చిత్రాల నిర్మించి మంచి పేరు సంపాదించారు . బాలాజీ టెలిఫిలిమ్స్‌ అనే నిర్మాణ సంస్థపై ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది.మహిళా ప్రేక్షకుల నాడిని కనిపెట్టిన ఏక్తారోజంతా కష్టపడి ఇంటికొచ్చి భర్తను పట్టించుకోకుండా భార్య టీవీకే అతక్కుని ఉందంటే ఆమె ఏక్తా కపూర్‌ నిర్మించిన ఏదో ఇక సీర్‌యల్‌ను చూస్తుందని భర్త అర్ధం చేసుకునే వాడు. కొంత సమయం వార్తలు కాని క్రికెట్‌ మ్యాచ్‌ కాని చూద్దాం అన్నా వీలవ్వక అనేక మంది పురుషులు ఇబ్బంది పడేవారట. చివరికి వాళ్లు కూడా సీరియల్‌ చూడటం ప్రారంభించేవారట. ఇలా పురుషులు కూడా ఏక్తా తీసిన సీరియల్స్‌కు అభిమా నులయ్యేవారు.

ఇంతలా మహిళల అభిమానులను ఏక్తా ఎలా సంపాదించిందో తెలుసా?.. ప్రతికుటుంబంలో జరిగే చిన్న విషయాలను గమనించి వాటినే సీరియల్స్‌ రూపంలో నిర్మించేదట. అప్పుడప్పుడు కొందరు సినిమా స్టార్‌లు అతిథి పాత్రలను కనిపించడం విశేషం. ఇదే ఫార్ములాతో హమ్‌ పాంచ్‌, కహానీ ఘర్‌ ఘర్‌కీ, కైసా యే ప్యార్‌ హే, కసౌటీ జిందగీకీ, కితినీ మోహబ్బత్‌ హై, నిర్మించింది. ప్రస్తుతం ఏక్తా నిర్మించిన పవిత్ర రిష్తా, ప్యార్‌ కీ యే ఏక్‌ కహానీ, బడే అచ్ఛే లగతే హే, పరిచయ్‌ సీరియల్‌లు విజయవంతంగా ప్రసారమవుతున్నాయి.

బాలాజీ టెలీఫిలిమ్స్‌బాలాజీ టెలీఫిలిమ్స్‌ను ఏక్తా కపూర్‌ 1994లో స్థాపించారు. ఈ సంస్థ మొదట నిర్మించిన సీరియల్‌ ‘మానో యా నా మానో’ 1995లో జీ టీవిలో
ప్రసారమయ్యింది. అయితే తొలి విజయం మాత్రం డి.డి. మెట్రో ఛానల్‌లో ప్రసారమయిన ‘ధున్‌ ధమాకా’ సంగీతాధారిత కార్యక్రమంతో లభించింది. తరువాత ‘క్యోంకీ సాస్‌ భీకభీ బహూతీ ’ సీరియల్‌తో బాలాజీ టెలిఫిలిమ్స్‌ మంచి గుర్తింపు సాధించింది. ఆ తరువాత అనేక సీరియల్లను చిత్రాలను సంస్థపై నిర్మించారు, నేటికీ నిర్మిస్తున్నారు.

ఏక్తా ‘కె ’ సెంటిమెంట్‌...

ఏక్తా కపూర్‌ నిర్మాణంలో విజయం సాధించిన సీరియల్స్‌లో చాలా శాతం ‘కె ’ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమవుతాయి. అందులో క్యోకీ సాస్‌ భీ కభీ బహూతీ, కహానీ ఘర్‌ ఘర్‌కీ, కైసా యే ప్యార్‌ హే, కసౌటీ జిందగీకీ, కితినీ మోహబ్బత్‌ హై, వంటి సీరియల్స్‌ ఉన్నాయి. ఈ సెంటిమెంటు చిత్రాల విషయంలో కూడా కొంత ఫలితం తీసువచ్చింది. కుచ్‌తో హే, కృష్ణా కాటేజ్‌, కోయి అప్సా , క్యా కూల్‌ హె హమ్‌ వంటి చిత్రాలను ప్రేక్షకులు ఆధరించారు. తరువాత చిత్రాల విషయంలో సెంటిమెంట్లను పక్కన పెట్టి కథాంశానికి తగిన పేరుని ఎంపికచేస్తుంది .

చరిత్ర సృష్టించిన టీవి సీరియల్‌...

బాలాజీ టెలిఫిలిమ్స్‌ నిర్మించిన ‘క్యోంకీ సాస్‌భీ కభీ బహూతీ ’ టీవీ సీరియల్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం అయ్యి సంచలన విజయం సాధించింది. ఈ సీరియల్‌ని ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌ సంయుక్తంగా నిర్మిం చారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సీరియల్‌ 1830 ఎపిసోడ్లు నిరంతరాయంగా ప్రసారమై భారతీయ టెలివిజన్‌ చరిత్రలోనే ఎక్కువకాలం ప్రసారమైన సీరియల్‌గా రికార్డు సృష్టించింది.అంతే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత ప్రేక్షకాధరణ సంపాదించింది. దాదాపు 5 సంవత్సరాలు నిరంతరాయంగా అత్యంధిక టీఆర్‌పీ కలిగిన సీరియల్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ సీరియల్‌ ప్రసారమయ్యే సమయంలో మహిళలు టీవీ సెట్లకు అతుక్కుపోయోవారు. భారత దేశంలోని వివిధ భాషలలోనూ ఈ సీరియల్‌ ప్రేక్షకులను అలరించింది. దీని పాపులారిటి విదేశాలకు కూడా పాకింది.

నిర్మాతగా చేసిన చిత్రాలు...

కుటుంబ కథా సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఏక్తా.. ఎన్నో బాలీవుడ్‌ చిత్రాలను నిర్మించింది. అంతే కాకుండా షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌ వాలా, మిషన్‌ ఇస్తాంబుల్‌, చిత్రాలకు సహ నిర్మాత కూడా. క్యోంకీ.. మై జూట్‌ నహీ బోల్తా, కుచ్‌తో హే, కృష్ణాకాటేజ్‌, కోయి అప్సా, క్యా కూల్‌ హె హమ్‌ ‘రాగినీ ఎమ్‌.ఎమ్‌.ఎస్‌’, ‘లవ్‌ సెక్స్‌ ధోఖా ’ చిత్రాలకు నిర్మాత. ఈ మధ్యన ‘డర్టీ పిక్చర్ ’ కూడా చేసింది. ప్రస్తుతం ‘రాగిని ఎం.ఎం.ఎస్ -2 ’ తీసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ప్రొఫైల్

పూర్తి పేరు            : ఏక్తా జీతేంద్ర పూర్‌
పుట్టిన తేది           : జూన్‌ 7, 1975
తల్లి దండ్రులు         : జితేంద్ర శోభా కపూర్‌
సోదరుడు             : తుషార్‌ కపూర్‌
వృత్తి                  : టీవి, చలన చిత్ర నిర్మాత డైరక్టర్‌,
                         బాలాజి టెలీఫిలిమ్మ్‌ జాయింట్‌ మ్యానేజింగ్‌ డైరక్టర్‌
కీర్తి కిరీటం             : కోంకీ సాస్‌ భీ కభీ బహూతీ (2000)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malayalam actress gopikapng
Lakshmi venkataraman founding trustee of the byst  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles