Biography of taslima nasreen

Taslima Nasrin (Bangladeshi author), encyclopedia, encyclopaedia, britannica, article,Taslima Nasrin (Bangladeshi author), encyclopedia, encyclopaedia, britannica, article

Taslima Nasrin (Bangladeshi author), Aug. 25, 1962 Mymensingh, East Pakistan [now Bangladesh] Bangladeshi feminist author who was forced out of her country because of her controversial writings, which many Muslims felt discredited Islam. Her plight was often compared to that of Sir Salman Rushdie, author of The Satanic Verses (1988)

Biography of Taslima Nasreen.GIF

Posted: 02/13/2012 07:31 PM IST
Biography of taslima nasreen

Biography_of_Taslima_Nasreen2

Taslima-Nasreenస్త్రీవాదం- మన దేశ నైసర్గిక స్వభావానికి అనుగుణంగా రూపు దిద్దుకోవాలే గాని, వేలం వెర్రిగా యూరప్‌ దేశాలను అనుకరిచండం కాదు. అక్కడి నైతిక విలువలు ఇక్కడి నైతిక విలువలు వేరువేరుగా ఉంటాయి. వేష భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు వేరు వేరు. అందువల్ల పిచ్చిగా ఒకరిని అనుకరించడం మంచిది కాదు. మనల్ని మనం, మన ప్రత్యేకతల్ని మనం కాపాడుకుంటూనే విశ్వమానవ ప్రగతికి దోహదం చేయాలంటారు తస్లీమా నస్రీన్‌. ఆమెను ఆమె మాతృదేశం వదిలేసింది. అక్కడి మతతత్త్వ వాదులు ఆమెను చంపుతామని బెదిరించారు. సజీవంగా దహనం చేయడానికి సిద్ధపడ్డారు. ఆమె రచించిన పుస్తకాలు చించేశారు. కాల్చేశారు. ఎన్ని చేసినా వారి ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఒక వ్యక్తిగా రచనా శక్తితో ప్రపంచ ఖ్యాతినార్జించారామె. ఆమె బంగ్లా దేశపు నవలా రచయిత్రి తస్లీమా నస్రీన్‌! 1993లో ఆమె తన తొలి నవల ‘లజ్జ’ ప్రకటించడంతో పాటు ఆమెకు ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యా యి.మానవతావాదం, మహిళావాదం, పునాదులుగా ఆమె రచనలు చేయడం ప్రారంభించగానే ముస్లిం మతతత్త్వవాదులు ఆమెపై కత్తి దూశారు. మానవ హక్కుల పరిరక్షణను గానీ, స్వేచ్ఛాయుత భావ ప్రకటనను గానీ వారు భరించలేకపోయారు. రచయిత్రిగా ఆమె కలాన్ని అణగదొక్కాలని ప్రయత్నించారు. ఆమె తన వృత్తిని, ప్రవృత్తిని మరచి పురుషాహంకారానికి తల వంచి సగటు ముస్లిం వనితలాగా బురఖా మాటున కాలం గడిపితే బహుశా వాళ్ళు సంతోషించేవారేమో. కాని అలా జరగలేదు. వారి అభీష్ఠానికి వ్యతిరేకంగా ఆమె డాక్టరయ్యారు. డాక్టరుగా వైద్యం చేసుకుంటే బాగుండేది. అంతకంటె ప్రమాదకరమైన రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. అదైనా వారి మతానికీ, ఛాందస కట్టుబాట్లకు, సంప్రదాయాలకు లోబడి రచనలు చేస్తే హర్షించేవారే. కాని అలా జరగలేదు. వైద్యురాలిగా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపే ప్రయత్నం చేశారు.

తస్లిమా నస్రీన్‌ తన సృజనాత్మక సాహిత్యం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల పంథాలో నడపాలని చూశారు. ఆడ, మగ సమానమని, ఆడది మగవాడికి బానిస కాదని చాటి చెప్పారు. ఆ విషయమే బంగ్లాదేశ్‌లోని ముస్లిం ఛాందస వాదులకు నచ్చలేదు. ఆమెను దేశంనుంచి తరిమి వేసేదాకా నిద్రపోలేదు. తప్పని పరిస్థితుల్లో దేశం వదలిన ఆమె యూరప్‌ దేశాలకు వలస వెళ్ళారు. ఏళ్ళకేళ్ళు తిరిగి తిరిగి చివరకు పారిస్‌లో స్థిరపడ్డారు. ఆమె రాసేది బెంగాలీలోనైనా... వాటి అనువాదాలు ప్రపంచ భాషలన్నిటిలోనూ వెలువడుతున్నాయి. ఆమె అభ్యుదయ భావజాలాన్ని హర్షిస్తూ అనేక ప్రభుత్వాలు, ప్రజాసంస్థలు, మిత్రులు, అభిమానులు ఆమెకు అండగా నిలబడ్డారు. భారత దేశంలో కూడా ఆమెను, ఆమె రచనల్ని వ్యతిరేకించే మత ఛాందస వాదులున్నా , ఆమెను ప్రోత్సహించి సహకరించే ముస్లిం ప్రగతిశీలవాదులు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం ఆమెకు వీసా ఇచ్చి దేశంలో పర్యటించడానికి అనుమతిచ్చింది. ఆసియా అన్నా, భారత ఉపఖండమన్నా, కొల్‌కత్తా మహానగరమన్నా ఆమెకు ఎంతో ప్రీతి. మాతృదేశం బంగ్లా దేశ్‌ అన్నా, ఢాకా నగరమన్నా ప్రాణమే. కాని నిషేధపు ఉత్తర్వులు అమలులో ఉన్నందున ఇప్పుడామె అక్కడికి వెళ్ళలేరు. తల్లి నుండి వేరు చేసిన బిడ్డ లాంటిది తస్లిమా నస్రీన్‌ పరిస్థితి. స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని కలలు గన్నందుకు ఆమెకు శిక్ష- జన్మభూమిపైనే కాలుమోపనీయక పోవడం ఎంతవరకు సబబు? ఆలోచనలు గొప్పవి కావొచ్చు, కాకపోనూ వచ్చు- కాని ఒక రచయిత్రి భావ వ్యక్తీకరణను అణచివేయడమనన్నది అమానుష చర్య. ప్రజాతంత్ర వాదులంతా తీవ్రంగా నిరసించే చర్య. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఛాందసవాదుల్ని సవాలు చేస్తూ ఆమె రచనలు చేయడం చాలా గొప్ప విషయం. తస్లిమా సహనశీలి. ధీర వనిత, మేధావి. పిచ్చి మొక్క అని భ్రమించి, వ్రేళ్ళతో సహా పెరికి పారేసిన మొక్క, చనిపోకుండా మళ్ళీ వ్రేళ్ళూనుకుని పెరిగి, మహా వృక్షమై తన స్వేచ్ఛను ప్రకటించుకోవడం, పదుగురికి నీడనివ్వడం, తన జ్ఞాన ఫలాల్ని అందించడం సాధారణ విషయం కాదు కదా! అసాధారణ ప్రతిభా పాటవాలు లేకపోతే పారిస్‌లో కూచుని బెంగాలీ రచలు చేస్తూ వాటికి జర్మన్‌, ఫ్రెంచ్‌ అనువాదాలు చేయిస్తూ ప్రపంచ దేశాలు పర్యటిస్తూ ఉండడం సాధ్యం కాదు కదా! అదీ కేవలం రచయిత్రిగా బతుకుతూ ఇన్ని పనులు చేయడం సాధ్యం కాదు కదా! నిజమే! కాని అసాధ్యాలన్నింటిని సాధ్యం చేసి చూపారు ఈ బంగ్లా రచయిత్రి. ముంబాయి నుంచి వెలువడే మరాఠీ వార్తా పత్రిక ‘మహానగర్‌’ తస్లీమా నస్రీన్‌ నవల అనువాదాలు సీరియల్‌గా ప్రచురించింది. ‘లజ్ఞ’, ‘శోధ్‌’, ‘ఫెరా’ మొదలైన నవలల అనువాదాలన్నీ దీపావళి ప్రత్యేక సంచికలలో అచ్చయి మరాఠీ పాఠకుల్ని అలరించాయి. మహానగర్‌ సంపాదకుడు నిఖిల్‌ వాగ్లే దృష్టిలో తస్లిమా ఒక సంచలనం. ఒక అగ్ని కణం. భావ స్వేచ్ఛకోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయని మహా వనిత, మహా రచయిత్రి అవునా కాదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. తెగువ, తెగింపు ఉండడం, నిరాశ పడకుండా పోరాడుతూ ఉండడం మామూలు విషయం కాదు అని అంటారాయన. మత ఛాందసుల శక్తి- దయ్యం శక్తి లాంటిది. ఎంతో బలమైంది. దాంతో ఒంటరిగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పోరాడడం ఎంత క్లిష్టమైన పని?


మత ఛాందసవాదులు కేవలం బంగ్లాదేశ్‌లో మాత్రమే కాదు, ప్రపంచమంతటా ఉన్నారు. అన్ని మతాలలో ఉన్నారు. అలాగే వారిని అడ్డుకునే మేధావులు, అభ్యుదయ కాముకులు ప్రపంచమంతటా ఉన్నారు. వారినందరినీ కూడా గట్టుకుని, వారి సహాయ సహకారాలతో కవులు, రచయితలు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలన్నది తస్లీమా అభిమతం. స్ర్తీవాదం- మన దేశ నైసర్గిక స్వభావానికి అనుగుణంగా రూపు దిద్దుకోవాలే గాని, వేలం వెర్రిగా యూరప్‌ దేశాలను అనుకరిచండం కాదు. అక్కడి నైతిక విలువలు ఇక్కడి నైతిక విలువలు వేరువేరుగా ఉంటాయి. వేష భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు వేరు వేరు. అందువల్ల పిచ్చిగా ఒకరిని అనుకరించడం మంచిది కాదు. మనల్ని మనం, మన ప్రత్యేకతల్ని మనం కాపాడుకుంటూనే విశ్వమానవ ప్రగతికి దోహదం చేయాలంటారు నస్రీన్‌. స్ర్తీవాదం అనేది ఒక ఫ్యాషన్‌ కాదనీ, మనస్ఫూర్తిగా త్యాగాలు చేసి, పోరాడి, సమానత్వం సాధించాలే గాని బేలగా అడుక్కోవడమో, పురుష జాతిని ద్వేషిచడమో, నైతిక సూత్రాలకు నీళ్ళు వదిలి విశృంఖలత్వానికి దారులు వేయడమో కాదని ఘంటాపథంగా చెబుతారు తస్లిమా నస్రీన్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  An interview with chetan bhagat
International womens conference  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles