మండల కేంద్రానికి సుదూరంలో వున్న బూదరాళ్ల పంచాయతీ గరిమండ, పిట్టలపాడు, వంతమర్రి, కునుకూరు; వెలగలపాలెం పంచాయతీ కిత్తాబు గ్రామాలకు ఇంత వరకు విద్యుత్ సదుపాయం లేదు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, కనీస రహదారి లేకపోవడంతో విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కావడం లేదు. ప్రధాన రహదారి నుంచి సుమారు 30-50 కిలోమీటర్ల మేర నడిస్తేగాని ఈ గ్రామాలకు చేరుకోలేం. ఇటువంటి గ్రామాలకు ఎలాగైనా విద్యుత్ సదుపాయం కల్పించాలని ఈపీడీఎస్ఎల్ అధికారులు నిశ్చయించారు.డీడీజీఎస్ సిస్టమ్‌లో సోలార్ ఫొటోవాల్టాక్(ఎస్‌పీసీ) పద్ధతి కింద విద్యుత్ సదుపాయం కల్పించడానికి తొల దశలో ఈ ఐదు గ్రామాలను ఎంపిక చేశారు.
సుమారు కోటి 25 లక్షల రూపాయలతో ఆయా గ్రామాల్లో విద్యుత్ బ్యాంకులు నిర్మించారు. గ్రామంలో వున్న ఇళ్ల సంఖ్యనుబట్టి గ్రామానికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రిమియర్ సోలార్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక్కొక్క గ్రామానికి నాలుగు నుంచి పది కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి 140 వాట్ల సామర్థ్యంతో విద్యుత్ సరఫరా అయ్యేలా కనెక్షన్‌లు ఇచ్చారు. దీనితో ప్రతి ఇంటిలో రెండు లైట్లు, ఒక ఫ్యాన్, ఒక ప్లగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం వసూలు చేస్తున్న విద్యుత్ చార్జీల ప్రకారమే వినియోగదారుల నుంచి బిల్లు వసూలు చేస్తారు. దీని కోసం ఇళ్లల్లో మీటర్లు కూడా అమర్చారు.
త్వరలో మరో 15 గ్రామాలకు.. మండలంలో మూరుమూలన వున్న మరో 15 గ్రామాలకు కూడా సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఇదే విధానంలో విద్యుత్ సదుపాయం కల్పిస్తామని స్థానిక ఏఈ శ్యామ్‌కుమార్‌సాహు చెప్పారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, మరో నెల రోజుల్లో ఈ గ్రామాలు కూడా విద్యుత్ వెలుగులకు నోచుకుంటాయని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more