Financial tips to save money for future

financial tips, money savings tips, savings money, savings accounts, financial tips for savings, savings money tips, organising tips to save money, money problems, financial problems, mutual funds

financial tips to save money for future to face financial problems

సంపాదనను పొదుపు చేసుకునే మార్గాలు

Posted: 09/22/2014 04:17 PM IST
Financial tips to save money for future

మార్కెట్లో విలువలు కాలాలను బట్టి మారుతుంటాయి. ఒకసారి ధరలు తగ్గుముఖం పడితే.. మరోసారి అమాంతంగా పెరిగిపోతుంటాయి. ఎక్కువ డబ్బులు సంపాదించేవారికి ఇటువంటి విషయాలలో తేడాలు కనిపించకపోవచ్చు. కాని మిడిల్, లో క్లాస్ కుటుంబాలవారి మీద ఇవి చాలా ప్రభావం చూపుతాయి. అటువంటి సమయాలలో ఏ పథకాలను అమలు చేస్తే డబ్బును మదుపు చేసుకోవచ్చు.... పెట్టుబడులు ఏ విధంగా పెట్టుకోవాలి అన్న విషయాలపై అవగాహన వుండాల్సిన అవసరం వుంది. అందులో కొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటే... భవిష్యత్ లో వచ్చే కష్టకాలాలను సులభంగా అధిగమించవచ్చు.

డబ్బులు మదుపు చేసుకోవడానికి పాటించాల్సిన మార్గాలు....

మీరు సంపాదించిన కష్టార్జితంలో మిగిలిన మొత్తాన్ని మదుపు చేయాలనుకున్నప్పుడు వాటిని ఒకే చోట చేయకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు వివిథ పథకాలలో మదుపు చేయడానికి ప్రయత్నించండి. అందులో మనకు షేర్లు, మ్యూచువల్, ఫండ్లు, స్థిరాస్తి, బంగారం, బీమా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా రకరకాల పథకాలలో మదుపు చేసుకోవడం చాలా మంచింది. ఇలా చేయడంవల్ల ఏదైనా ఒకదానిలో వచ్చే నష్టాన్ని మనం ఇంకొక దానిలో వచ్చే లాభంతో పూరించుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్ లో వచ్చే కష్టాలను అధిగమించవచ్చు.

మీరు మదుపు చేసిన డబ్బుతో లాభాలు సాధించాలంటే... ముందుగా మీరు పెట్టే పెట్టుబడులకు ఒక నిర్ణీతమైన విధానం పాటించాలి. అప్పుడే మీరు ఫలితాలను పొందగలరు. అంటే... మీరు పెట్టే పెట్టుబడులకు ఒక నిర్ణీత కాలాన్ని ఏర్పరుచుకోవాలి. అందులో వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఆ తరువాతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్లు పెట్టాలనుకుంటే ముందుగా దానికి సంబంధించిన అన్ని విషయాలలో అవగాహన వుంటే చాలా మంచిది. అందులో వున్న లోపాలను, లొసుగులను తెలుసుకున్న తరువాత షేర్లు పెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పెట్టిన పెట్టుబడులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడూ వాటిని సమీక్షించుకోవాలి. అలా కానిపక్షంలో దానివల్ల పెద్ద లాభం చేకూరదు.

మీరు షేర్లలోగాని, ఫండ్లలో గాని పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు సాధ్యమైనంతవరకు మీ దగ్గరే మిలిగిన సొమ్ముతోనే చేయండి. అలా కుదరని వేళ దానిని వదిలివేయడం చాలా మంచింది. ఒకవేళ మీరు అప్పు చేసి షేర్లు చేయాలనుకుంటే... కొన్ని సందర్భాలలో దానికి తగిన వడ్డీ కూడా గిట్టుబాటు కాకపోవచ్చు. ఇలా చేయడం వల్ల తీవ్రనష్టం సంభవిస్తుంది.

పెట్టుబడి పెట్టుకునేటప్పుడు ఎప్పటికీ ఇతరుల మాటలను పట్టించుకోకూడదు. సాధ్యమైనంతవరకు మీకై మీరే ఆ సంస్థ గురించి మొత్తం విషయాలను తెలుసుకుని షేరులో మదుపు చేయడం చాలా శ్రేయస్కరం.

మీరు పెట్టిన పెట్టుబడులలో ఒకవేళ నష్టాలు సంభవిస్తే.. దానికి భావోద్వేగానికి గురికాకుండా వాటిని అధిగమించేలా నిర్ణయాలను తీసుకోవాలి. దురాశ, దు:ఖం, భయాలను మార్కెట్ విషయాలలో ఎప్పటికీ పెట్టుకోకూడదు. వాటిని జయించినప్పుడే మనం సంభవించిన నష్టాలను ఎదుర్కొని విజయం సాధించగలం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : financial tips  savings plans  money savings tips  financial problems  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more