naga shourya busy with back to back 2 movie shootings | tollywood news | telugu young heroes | Malavika nair

Naga shourya busy with back to back movie shootings tollywood news telugu young heroes

naga shourya, naga shourya movie, tollywood news, director nandini reddy, actress malavika nair, kalyana vaibhogame movie, telugu film industry, telugu young heroes

naga shourya busy with back to back movie shootings tollywood news telugu young heroes : Tollywood young lover boy naga shourya busy with back to back 2 movie shootings.

ఈ లవర్ బాయ్ అక్కడ, ఇక్కడ్ ఫుల్ బిజీ!

Posted: 07/09/2015 11:30 AM IST
Naga shourya busy with back to back movie shootings tollywood news telugu young heroes

టాలీవుడ్ యంగ్ లవర్ బాయ్ గా పేరొందిన హీరో నాగశౌర్యం.. ఇటీవలే ‘జాదుగాడు’ సినిమాతో తనలో దాగిన ‘మాస్’ని చూపించాడు. కానీ.. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేదు. అయితేనేం.. ఈ హీరోకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శౌర్య రెండు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. కొద్దిరోజులు ఓ మూవీ షూటింగ్ లో పాల్గొంటే.. మరికొన్ని రోజులు మరో షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయాడు.

అందులో ముందుగా నందిని రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమాని ‘శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్’పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేం మాళవిక నాయర్ నటిస్తోంది. పర్ఫెక్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు దర్శకనిర్మాతలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాతోపాటు నాగ శౌర్య హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ కూడా దాదాపు 70% పూర్తి కావచ్చింది. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుంటే.. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇలా ఈ విధంగా యువహీరో నాగ శౌర్య ఈ రెండు సినిమాల షూటింగ్ లో కంటిన్యూగా బిజీగా ఉన్నాడు. కొద్ది రోజులు నందిని రెడ్డి సినిమా కొద్ది రోజులు రమేష్ వర్మ సినిమా అస్సలు గ్యాప్ లేకుండా బిజీబిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga shourya  malavika nair  nandini reddy  kalyan vaibhogame  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more