‘రేసుగుర్రం’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే! గతకొన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే ముహూర్త కార్యక్రమాల్ని జరుపుకుంది. శరవేగంగా ప్రీప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈనెల 19వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.
ఇదిలావుండగా.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం ఈ సినిమాను ‘షూటింగ్’ ఎపిసోడ్ తో స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఆసక్తిని రేకెత్తించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కి, ‘కెచ్చా’ అనే థాయ్ లాండ్ కి చెందిన స్టంట్ మాస్టర్ తో ఈ ఫైట్ కంపోజ్ చేయించారు. ఇప్పుడు ఈ తాజా చిత్రానికి కూడా ఆయనే పనిచేస్తున్నాడని సమాచారం. ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలతోనే ఈ మూవీ సినిమా మొదటి షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఇందుకుగాను బన్నీ కూడా బాగానే కసరత్తు చేశాడని.. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది కాబట్టి దీనిపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్ అయిన బన్నీ స్టైల్, కమర్షియల్-యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మొదటి షెడ్యూలే ‘యాక్షన్’ ఎపిసోడ్ తో స్టార్ అవుతుండడంతో ఈ సినిమా ఎలా వుంటుందోననే ఆసక్తి యూత్ లో పెరుగుతోంది. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more