తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోమారు రంగుమారిన ఆంధ్రా ఊసరవెల్లిలా మారారని తెరాస అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రజల బాధలుగానీ, ఇబ్బందుగానీ, హక్కుల గురించి గానీ ప్రస్తావించలేదని ఆయన విరుచుకుపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర విభజన గురించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం హాజరుకాలేదా అని ఆయన ప్రశ్నించారు. విభజనకు సంబంధించి సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారన్న చంద్రబాబు ఆరోపణ పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తు పెట్టుకుని చేసిన ప్రసంగాల టేపులు తమవద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని ఆయన చెప్పారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ సారాంశాన్ని పరిశీలించాక తాను పూర్తి స్థాయిలో స్పందిస్తానని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు లేఖపై తెరాస శాసనసభపక్ష నేత ఈటెల రాజేందర్ కూడా తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు మరోసారి ఆంధ్రాబాబు అని నిరూపించుకున్నారు. తెలంగాణ ప్రజలు తన సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more