Kodandaram comments on hyderabad

kodandaram comments on hyderabad, tpjac chairman m kodandaram, hyderabad our city kodandaram, telangana bill, telangana movement, tpjac chairman prof m kodandaram ,breaking news, ap politics, political news, andhra news

kodandaram comments on hyderabad, TPJAC Chairman M Kodandaram

హైదరాబాద్ పై రాజీ లేదు- రక్షణ కల్పిస్తాం

Posted: 08/07/2013 06:39 PM IST
Kodandaram comments on hyderabad

హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. జెఎసి విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 10 నుంచి సద్భావన యాత్ర చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ డిమాండ్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. రేపటి మంత్రి మండలి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇటువంటి కీలక తరుణంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు మౌనంగా ఉండడం సరికాదన్నారు. వస్తున్న తెలంగాణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే, మరికొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొడదాం - తెలంగాణను కాపాడుకుందాం అని పిలుపు ఇచ్చారు. డిజీపీ దినేష్‌రెడ్డిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన వారిని నియమించాలని ఆయన కోరారు. దినేష్‌రెడ్డి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు అన్ని వర్గాలు కలిసి సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. అందుకోసం త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంత మంత్రులు, నాయకులు చొరవ చూపాలని సూచించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణ లో 60 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో పనిచేసే వారు సీమాంధ్ర ఉద్యోగుల మాటలకు మోసపోవద్దని అన్నారు. వారికి ఉద్యోగ సంఘం రక్షణ కల్పిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకున్న కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారి దుశ్చర్యలను అడ్డుకుంటామని తెలిపారు. కొంతమంది ఐఎఎస్ అధికారులు ఆంధ్రా అధికారులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more