Salarjung museum in hyderabad

Salarjung Museum - museums and memorials in india, andhra pradesh, hyderabad - , Salarjung Museum Mughal Miniatures, European Paintings & sculptures, Chinese Porcelain, Japanese Silk Paintings, Carpets, Clocks, rare manuscripts, jade and ivory works, Sculpture, Veiled Rebecca, Double figure, G.H Benzoni, Musical clock, Arabic Al Quran in Nashq (1288 AD), jade crafted knifes of Jehangir, Nurjahan, European paintings, Venice, Soap Bubbles, Museums, Monuments, Hyderabad, Andhra Pradesh, India

description about Salarjung Museum in Hyderabad.

60 years Salarjung Museum.GIF

Posted: 12/15/2011 03:42 PM IST
Salarjung museum in hyderabad

60_years_Salarjung_Museum2
Salarjung-Museum-in-Hyderabదేశ విదేశీ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాలార్‌జంగ్ మ్యూజియం ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అరవై ఏళ్ల కాలంలో అనేక మైలురాళ్లను అధిగమించి అరుదైన కళాఖండాలతో అలరారుతోంది. దాదాపు 49వేల కళాఖండాలు, 42 గ్యాలరీలతో విస్తరించిన సాలార్‌జంగ్ మ్యూజియం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం పాలక మండలి సభ్యుడు నవాబ్ జాకీర్ హుస్సేన్ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా మొదటి సాలార్‌జంగ్ మీర్ తురబ్ అలీ ఖాన్ భవనంలో ప్రముఖ గజల్ గాయకుడు పండిట్ ఎస్.విఠల్‌రావు గజల్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజాంల వద్ద ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన ముగ్గురు సాలార్‌జంగ్‌లు దేశవిదేశాల నుంచి సమీకరించిన అరుదైన..అద్భుత కళాఖండాలతో సాలార్‌జంగ్‌ల అధికార నివాసం దివాన్ దేవిడీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1951 డిసెంబర్ 16న ప్రారంభించారు.పరిపాలనా కార్యకలాపాల కోసం నిర్దేశించిన దివాన్‌దేవిడీ నిర్మాణాలు మ్యూజియం సందర్శకులకు ప్రతిబంధకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నయాపూల్ సమీపంలో మూసీ నది ఒడ్డున సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించింది. ఈ నూతన భవనంలోకి తరలించిన సాలార్‌జంగ్ మ్యూజియంను 1968 జులై 24న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ప్రారంభించారు. సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో మ్యూజియం గ్యాలరీల విస్తరణ అనివార్యమైంది. దీంతో ప్రధాన భవనానికి ఇరువైపులా రెండు కొత్త భవనాలను నిర్మించారు. మీర్ తురబ్అలీ ఖాన్ (మొదటి సాలార్‌జంగ్) పేరుతో నిర్మించిన భవనాన్ని 1990లో అప్పటి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ రంగరాజన్ ప్రారంభించారు. తూర్పు వైపున మీర్ లాయక్అలీ ఖాన్(రెండో సాలార్‌జంగ్) పేరుతో విస్తరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శిల్పకళాకారుడు బెంజోనీ రూపొందించిన ముసుగురాణి వెల్డ్ రెబెకా పాలరాతి విగ్రహం, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న గంటల గడియారం సాలార్‌జంగ్ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Electronic waste
Karthika bids adieu to mayor post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more