Kids Jokes
రాక్షసితో ఇప్పించుకోమంది!

ఒకరోజు పప్పు తన ఇంటి పక్కనే వున్న ఒక ఆంటీ ఇంటికి వెళతాడు.
డోర్ బెల్ కొట్టగానే ఆ ఇంట్లో వున్న ఒక మహిళ బయటకు వచ్చి పప్పును చూస్తుంది. అప్పుడు
మహిళ : అరె పప్పు.. ఏమైంది? ఎందుకు డోర్ బెల్ కొట్టావ్? ఏమైనా కావాలా?
పప్పు : ఆంటీ.. అమ్మ ఒక గిన్నెడు చెక్కెర మీతో ఇప్పించుకో రమ్మని చెప్పింది.
అప్పుడు ఆ మహిళ నవ్వుకుంటూ పప్పు తో ఇలా అంటుంది.... ‘‘అవునా.. సరే మీ అమ్మ ఇంకేమి చెప్పింది?’’
పప్పు : అమ్మ ఏమని చెప్పిందంటే.. ‘‘ఒకవేళ ఆ డాయన్ చెక్కెర ఇవ్వకపోతే.. ముందరున్న ఆ రాక్షసి నుంచి తీసుకుని రా’’ అని చెప్పింది!

హోమ్ వర్క్ ఎందుకు చేయలేదు?

టీచర్ : హోమ్ వర్క్ ఎందుకు చేయలేదు?

పప్పు : మేడమ్.. ఇంట్లో పవర్ లేక చేయలేదు.

టీచర్ : అయితే కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా!

పప్పు : మేడమ్.. అగ్గిపెట్టే ఆ సమయంలో లేదు.

టీచర్ : అగ్గి పెట్టే ఎందుకు లేదు?

పప్పు : పూజామందిరంలో పెట్టారు 

టీచర్ : మరి అక్కడే వెళ్లి తెచ్చుకోవచ్చు కదా!

పప్పు : నేనప్పుడు స్నానం చేసుకోలేదు.

టీచర్ : ఎందుకు స్నానం చేసుకోలేదు. 

పప్పు : ఆ సమయంలో ఇంట్లో నీళ్లు లేవు మేడమ్ 

టీచర్ : అప్పుడు నీళ్లు ఎందుకు లేవు?

పప్పు : మేడమ్.. అప్పుడు ఇంట్లో వున్న మోటర్ పనిచేయలేదు. 

టీచర్ : ఒరేయ్ తెలివి తక్కువ దద్దమ్మ.. మోటర్ ఎందుకు ఆన్ అవ్వలేదు?

పప్పు : నేను ముందే చెప్పాను కదా మేడమ్.. ఇంట్లో పవర్ లేదని!

పిల్లలు చేసే అల్లరి!

ఒకరోజు ఒక టీచర్, ఒక స్టూడెంట్ తో ప్రశ్నలు అడుగుతుంది.

టీచర్ : టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు? 

విద్యార్థి : అతని ఆఖరి యుద్ధంలో...!

టీచర్ : గంగానది ఏ రాష్ట్రంలో పారుతుంది? 

విద్యార్థి : లిక్విడ్ రాష్ట్రంలో..!

టీచర్ : మహాత్మాగాంధీ ఎప్పుడు జన్మించారు? 

విద్యార్థి : ఆయన పుట్టినరోజున జన్మించారు!

టీచర్ : 15 ఆగస్టు రోజు ఏమవుతుంది? 

విద్యార్థి : 15 ఆగస్టు రోజు వస్తుంది. 

టీచర్ : 6 మందికి 8 మామిడిపళ్లు ఎలా పంచుతావు? 

విద్యార్థి : మ్యాంగో షేక్ చేయించి పంచుతాను...

ఈ సమాధానాలు విని టీచర్ డైరెక్ట్ కోమాలోకి వెళ్లిపోయింది.

లింకన్ ఏమయ్యాడు.. మీరేమయ్యారు!

ఒక తండ్రి తన కొడుకు చేసే అల్లరి వల్ల ఎంతో బెంగగా వుండేవాడు. 

కొడుకు ఎప్పుడు చూసినా కంప్యూటర్ లో గేమ్స్ ఆడుతుండేవాడు. 

ఒకరోజు ఆ తండ్రి కొడుకుకి చదువు మీద ఆసక్తి కలిగేలా కొడుకుతో ఇలా అంటాడు..

తండ్రి : అబ్రహమ్ లింకన్ నీ వయసులో వున్నప్పుడు రాత్రి సమయంలో కట్టెలు కాల్చుకునిమరీ చదువుకునే వాడు. 

అబ్బాయి : అదే అబ్రహం లింకన్ మీ వయసుకు వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రాష్ట్రపతి అయ్యాడు. మీరేం అయ్యారు.?

‘‘ఏదైనా మంచిపని చేసే ముందు చాక్లెట్ తినాలి’’

భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజూ ఏదో చిన్న విషయానికి కూడా గొడవపడుతుండేవారు. 

అలా కోపంలో భార్య తన భర్తతో ఈ విధంగా అంటుంది..

భార్య : ‘‘ఇక చాలు... ఇలా రోజు నీతో గొడవపడటం నావల్ల కాదు. నాకు తొందరగా విడాకులు కావాలి’’.

భర్త : ‘‘చాకెలెట్ తింటావా’’. 

(సిగ్గుపడుతూ) భార్య : ‘‘నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారా?’’

భర్త : ‘‘లేదే తింగిరిదానా... ఏదైనా మంచిపని చేసేముందు చాక్లెట్ తినాలని మా అమ్మ చెప్పేది’’. 

‘‘ఐటమ్ నెంబర్ 3’’

ఒకరోజు ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. 

అయితే ఆ సమయంలో ఆమె ఫోన్ ని తన బాయ్ ఫ్రెండ్ కాకుండా తన మేనల్లుడు లిఫ్ట్ చేస్తాడు. 

అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మేనల్లుడితో  ప్రేమతో ఇలా అంటుంది. 

గర్ల్ ఫ్రెండ్ : ‘‘మీ మామయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వవా...? అతనితో మాట్లాడాలి.’’

మేనల్లుడు : ‘‘సరే ఇస్తాను. కానీ ఆయనకు మీ పేరేం చెప్పాలి?’’

గర్ల్ ఫ్రెండ్ : ‘‘ఆయనతో వెళ్లి చెప్పు... తన ప్రియురాలి పోన్ చేసిందని’’

మేనల్లుడు : ‘‘కానీ మొబైల్ ఫోన్ లో మీ నెంబర్ ఐటమ్ నెంబర్ 3 అని సేవ్ చేసి వుంది’’. 

చెప్పండి నాన్నగారు.. నేనే మాట్లాడుతున్నా..!

ఒకరోజు నేను ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్లాను. 

అప్పుడు నాన్నగారు చాలా కోపంగా నన్ను చూసి, ఇలా అడిగారు.... ‘‘ఇంతసేపు ఎక్కడున్నావ్ రా!’’

నేను : ‘‘నా స్నేహితుడి ఇంటికి వెళ్లాను!’’

అప్పుడు వెంటనే నాన్నగారు నా నలుగురి (4) ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారు. 

అప్పుడు నాలుగవ వాడు : ‘‘చెప్పండి అంకుల్... అతను ఇక్కడే వున్నాడు’’.

మూడవ వాడు : ‘‘ఇప్పుడే ఇంటినుంచి వెళ్లాడు అంకుల్’’

రెండవవాడు : ‘‘ఇక్కడే వున్నాడు అంకుల్.. చదువుకుంటున్నాడు. అతనికి ఫోన్ ఇవ్వాలా?’’

ఇక చివరివాడయితే హద్దుమీరిపోయాడు...

మొదటివాడు : ‘‘నాన్నగారు చెప్పండి... ఏమైంది?’’

చంపించేశారు నా స్నేహితులు.. ప్రతిఒక్క ఫ్రెండ్ అవసరమే గురూ!