Political Jokes
దీని అర్థం ఏంటో తెలుసా దయా!

ఒకరోజు మన్మోహన్ సింగ్ ప్రసంగంలో మాట్లాడుతుండగా.. సీఐడీ ఆఫీసర్స్ ఈ విధంగా చర్చించుకుంటున్నారు. 

మన్మోహన్ సింగ్ : ‘‘వేలాది ప్రశ్నలకు జవాబులు చెప్పడం కంటే.. నా మౌనమే చాలా మంచిది. నేనింతవరకు ఎన్ని ప్రశ్నలకు జవాబులివ్వకుండ వున్నానో నాకే తెలియదు’’. 

ఫ్రెడ్రిక్స్ : ‘‘సార్ చూడండి... మన్మోహన్ సింగ్ గారూ ప్రసంగంలో ఏదో చెబుతున్నారు’’.

ఏసీపీ ప్రద్యుమన్ : ‘‘ఓ మై గాడ్! దీని అర్థం ఏంటో తెలుసా దయా..?’’

దయా : ‘‘ఆ ఏసీపీ సార్ గారూ.. నేను అర్థం చేసుకున్నాను. దీని అర్థం ఏంటంటే.. మన్మోహన్ సింగ్ గారూ కూడా మాట్లాడగలరు’’.

ఈ మాట వినగానే ఏసీపీ ప్రద్యుమన్ ఏం చెబుతారోనని చుట్టుపక్కల అభిజీత్, ఇంకా వేరే ఆఫీసర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 

ఏసీపీ ప్రద్యుమన్ : ‘‘లేదు దయా... దీని అర్థం ఇది కాదు.. దీని అర్థం ఏంటంటే.. సోనియాగాంధీగారు మన్మోహన్ సింగ్ ని ఏదో చెప్పమని ఆర్డర్ ఇచ్చారు.’’