UPCOMING Movies

రౌడీ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రౌడీలో మొదటిసారిగా వర్మ మంచు మోహన్ బాబు లాంటి సీనియర్ నటులను ఎంచుకున్నారు.

మోహన్ బాబు, విష్ణు కలిసి నటిస్తున్న రౌడీ చిత్రాన్ని ఏవి పిక్చర్స్ పతాకం మీద పార్ధసారధి, గజేంద్ర వినియ్ కుమార్ లు నిర్మిస్తున్నారు.

జయసుధ, శాన్వి ఈ ఇద్దరికీ మహిళా సహకారాన్ని అందిస్తున్నారు.  రౌడీ పేరుతో అంతకు ముందు మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ ఆయనకి పేరు తెచ్చిపెట్టింది.  ఇంకా రౌడీ పేరు మీద చాలా సినిమాలు వచ్చాయి.  రౌడీ అల్లుడు, స్టేట్ రౌడీ, పొలిటికల్ రౌడీ పేర్ల మీద కూడా గతంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఈ రౌడీ రాం గోపాల్ వర్మది కాబట్టి తప్పకుండా పవర్ ఫుల్ కారక్టర్స్ తో విశేషాన్ని సంతరించుకుంటుందనటంలో అనుమానం లేదు.

సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.