Teluguwishesh ‘ సింగం ’ ‘ సింగం ’ Singam Yamudu 2 Movie Review, Singam Telugu Movie Review, Singam Yamudu 2 Movie Rating, Singam Movie Review, Singam Review, Singam Movie Rating, Surya Singam Review, Surya Singam Movie Review, Singam Telugu Movie Review, Singam Trailers, Singam photos, Singam wallpapers, Singam Movie Posters, Singam Movie Stills, Surya In Singam, Anushka In Singam, Hansika In Singam, Singam MOvie Talk. Product #: 45824 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సింగం (యముడు2)

  • బ్యానర్  :

    ప్రిన్స్‌ పిక్చర్స్‌, స్టూడియో గ్రీన్‌

  • దర్శకుడు  :

    హరి

  • నిర్మాత  :

    ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్‌

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    ప్రియన్

  • ఎడిటర్  :

    వి.టి.విజయన్

  • నటినటులు  :

    సూర్య, అనుష్క, హన్సిక, వివేక్‌, సంతానం

Singam Yamudu 2 Movie Review

విడుదల తేది :

జూలై 05 2013.

Cinema Story

యముడు లో పోలీస్ ఆఫీసర్ అయిన సూర్య (నరసింహం) విలన్ ప్రకాష్ రాజ్ ని పట్టుకున్న తరువాత... తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అండర్ కవర్ ఆపరేషన్ లో చేరాల్సిందిన హోం మినిస్టర్ ఆదేశాల మేరకు అతను ఓ స్కూల్లో ఎన్ సిసి ఇంఛార్జిగా చేరుతాడు. అక్కడ నుండే డ్రగ్స్ రాకెట్ గురించి కూపీ లాగుతూ భాయ్ (ముకేష్ రుషి) మరియు త్యాగరాజు (రెహమాన్) ఆయుధాల అక్రమ రావణ చేస్తున్నట్టు తెలిసుకున్న నరసింహం వారు ఆయుధాలు కాదు ఇంటర్నేషనల్ డాన్ డానీ (డానీ)తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలుసుకుంటాడు. వారి వ్యాపారాన్ని నరసింహం ఎలా మట్టు పెట్టాడన్నదే మిగతా కథ.

cinima-reviews
‘ సింగం ’

పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు తీసే హరి ‘సింగం ’ సినిమాని తీసి వివిధ భాషల్లో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తమిళ వెర్షన్లో తెరకెక్కిన ‘సింగం ’ సినిమాను తెలుగులో ‘యముడు ’ పేరుతో విడుదల చేసి సూపర్ డూపర్  హిట్ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అదే ఊపులో దానికి సీక్వెల్ గా ‘సింగం - 2’ తీసి తెలుగులో ‘సింగం ’ పేరుతో విడుదల చేశాడు. పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం మెప్పించినంతగా మెప్పిస్తుందా లేదా ఓసారి చూద్దాం.

సింగం-1 (యముడు) మాస్ మసాల చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా క్లైమాక్స్ ముగింపు కూడా సీక్వెల్ తీసేంతగా లేదు. కానీ ఇదే ఊపులో సీక్వెల్ తీసి జనాల మీదికి వదిలితే ఆదరిస్తారనుకోవడం పొరపాటే. ఒకవేళ అలాంటి కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ తీద్దామని అనుకున్నప్పుడు. ఆ సినిమా కథను, దానికి మించిన సీన్లను రాసుకొని అప్పుడు తీయాలి. కానీ ఏదో సీక్వెల్ తీస్తున్నామని కథలో బలంలేకుండా తీసేశారు. ‘యముడు ’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ ని తలపించదు. మొదటి భాగంలో హీరో, విలన్ క్యారెక్టర్లను సమఉజ్జింగా ఉండేటట్లు చూసుకున్న దర్శకుడు ఈ సినిమాలో విలన్లకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా హీరోనే పవర్ ఫుల్ గా చూపించాడు. సినిమా మొదటి భాగంలో సూర్య ఖాకీ డ్రెస్సు వేసుకునేంత వరకు ఈ సినిమాలో ప్రేక్షకులకు కిక్ ఉండదు. ఆ తరువాత ఒక్కసారే హై రేంజ్ లోకి వెళుతుంది. ఆ తరువాత కొద్ది సేపటికే బ్రేక్ చెప్పి రెండో భాగం పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతారు. ఆ తరువాత సినిమా స్పీడ్ అని కొద్దేసేపే అలా మెయింటేన్ చేసి, క్లైమాక్స్ కి వచ్చే సరికి వీక్ అయిపోతుంది. ఈ సినిమాలో హీరో అరుపులతో, వాయిలెన్స్ తో తలనొప్పి పుడుతుంది. అనవసరమైన సీన్లు పెట్టి మూడు గంటలకు పైగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు.  మొత్తంగా చూస్తే మాస్ ప్రేక్షకులను మెప్పించే సినిమా అయినా, క్లాస్ ప్రేక్షకులని అలరించడం కష్టమే. ఇక యముడు సినిమాకు సీక్వెల్ అని తెలియడంతో ఓపెనింగ్స్ మాత్రం బాగానే రాబట్టుకుంది. కానీ ఎక్కువ రోజులు ప్రేక్షకులు ఈ వాయిలెన్స్ ని భరించడం కష్టమే.

Cinema Review

‘యముడు ’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించిన సూర్య ఈ సినిమాలో కూడా మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో భారాన్ని సూర్య ఒక్కడే మోశాడు. తనదైన శైలిలో పంచ్ డైలాగులు కొడుతూ, హై ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ తో అలరించాడు. పోస్టర్ల పై పెట్టుకున్న ‘ఆన్ ఇండియన్ పోలీస్ ’ అనే టైటిల్ కి సూర్య న్యాయం చేశాడు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన అనుష్క, హన్సికల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మినహా ఆమె కనిపించిన సందర్భాలు తక్కువే. స్టూడెంట్ పాత్రలో హన్సిక కనిపించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి సినిమాలో ఒక్క విలన్ ని పెట్టిన దర్శకుడు ఈ సినిమాలో ముగ్గుర్ని పెట్టాడు. కానీ పాత్రలు చెప్పుకోదగ్గట్లు లేవు. ఇంటర్నేషనల్ డాన్ గా డానీ చూపించారు. కానీ బిల్డప్ తప్ప హీరో ముందు నిలవలేక పోయాడు. కమేడియన్ సంతానం నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక తొలిసారి ఐటం సాంగ్ చేసిన అంజలి పాటకు తగ్గ ఐటెం స్టెప్పులు కూడా వేయగలనని నిరూపించింది. మిగతా వారు వారి వారి పాత్రల్లో రాణించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు

మొదటి భాగం ‘యముడు ’ సినిమాకు కథ ఎంత ప్రాణం పోసిందో దానికి తోడు దేవీ సంగీతం కూడా ప్రాణం పోసి సినిమా కమర్షియల్ గా హిట్ సాధించడంలో భాగం అయ్యాడు. కానీ ఈ సినిమాలో దేవీ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. ఆ సినిమాల్లో ఓ పాట కాకుంటే ఓ పాట బాగుంటుంది. కానీ ఇందులో ఏ పాట కూడా వినపొంపుగా లేదు. కమర్షియల్ సినిమాకు ఇవ్వాల్సిన బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా అంతగా రాణించలేక పోయాడు. ఇక స్ర్కీన్ ప్లే విషయానికి వస్తే... చిత్రంలో చాలా సన్నివేశాలను సాగదీసి ప్రేక్షకులకు విసుగు పుట్టించారు. ఈ విషయంలో ఎటిటర్ అవసరం లేకున్నా కమర్షియల్ సినిమా కాబట్టి సీన్లను కత్తిరించకుండా చెత్తను అలాగే ఉంచేశాడు.  స్క్రీన్ ప్లే వేగంగా సాగినా కూడా సగటు ప్రేక్షకుడికి నెక్స్ట్ సీన్ ఏంటో తెలిసిపోవడంతో అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక దర్శకుడి విషయానికి వస్తే... మాస్, కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి ఏ హీరో అయినా మాస్ గా చూపించి ప్రేక్షకులతో ఈలలు వేయిస్తాడు. ఈ సినిమా అతని స్టైల్లోనే ఉన్నా, మొదటి భాగంలో ఉన్న స్పీడు తగ్గిపోయింది. నిజానికి కథని చెప్పే విషయంలో దర్శకుడు జస్ట్ పాస్ మార్కులు మాత్రమే వేయించుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.

chivaraga

సింగం ‘సొల్లు ఎక్కువ , మేటర్ తక్కువ ’

 
more