Singer Sunitha Slams Cheater Chaitanya కటకటాల్లోకి.. సినీగాయని సునీత 'మేనల్లుడు'

Singer sunitha urged everyone not to believe fraudsters

singer sunitha, chaitanya, nephew, facebook account, charity programmes, fraudster, Anantapur, Andhra Pradesh, tollywood, Crime

Singer Sunitha came out with a video message alerting people about people, a person specifically who has been spreading the message that he has been close to Sunitha like a family member.

కటకటాల్లోకి.. సినీగాయని సునీత ‘‘మేనల్లుడు’’

Posted: 08/08/2020 11:56 AM IST
Singer sunitha urged everyone not to believe fraudsters

ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత పేరున వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ విషయమై స్వయంగా అమె పోలీసులకు పిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమ మార్గాల ద్వారా అప్పన్నంగా వచ్చే ఈజీ మనికీ అలావాటు పడిన కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మాయగాడి అక్రమాలపై పలువురు నేరుగా గాయని సునితీ దృష్టికి తీసుకురావడంతో అమెకు విషయం తెలిసింది. దీంతో తన పేరును వినియోగించుకుంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిపై అమె నేరుగా సైబర్‌ క్రైం పోలీసులకు పిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన చైతన్య అనే యువకుడ్ని అరెస్టు చేశారు. గాయని సునీత అభిమానిగా చెప్పుకొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె పేరుపై స్వచ్ఛంద సేవ చేస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. సునీత పేరు మీద నకిలీ ఫేస్ బుక్‌ ఖాతా సైతం తెరిచాడు. అంతేకాదు ఏకంగా అమె తన మేనత్త అంటూ చెప్పుకున్నాడు. ఈ విషయంపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అనంతపురంలోనూ కేసులున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh