Star Wars actor Andrew Jack dies of coronavirus కరోనావైరస్ బారిన పడి నటుడు అండ్రూ జాక్ మృతి

Star wars actor andrew jack dies from covid 19 at age 76

airport coronavirus screening, coronavirus, Star Wars, Andrew Jack, coronavirus, COVID-19, Star Wars actor, Andrew Jack dead, Andrew Jack death, Star Wars cast, Andrew Jack COVID-19, coronavirus screening, covid 19, coronavirus screening, health advisory, screening passengers, screening passengers coronavirus, self isolation, self quarantine, social distancing, hollywood, tollywood

British actor and dialect coach Andrew Jack has died at the age of 76 after he contracted COVID-19. Jack’s agent Jill McCullough announced the news, adding that he died in a hospital in Surrey, England. He had worked on Guardians Of The Galaxy, The Avengers and Lord Of The Rings.

కరోనావైరస్ బారిన పడి నటుడు అండ్రూ జాక్ మృతి

Posted: 04/02/2020 11:59 AM IST
Star wars actor andrew jack dies from covid 19 at age 76

ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని బలితీసుకున్న కరోనా వైరస్ మహమ్మారి.. బహుముఖ ప్రజ్ఞాశీలరులను కూడా తన కబంధహస్తాలలో చిక్కుకునేట్టు చేసి వారి ప్రాణాలను సైతం కబళించివేసింది. ఈ వైరస్ బారిన పడి ప్రముఖ నటుడు, 'స్టార్‌ వార్స్‌' సీరీస్ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆయనకు జరిపిన రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన్ను సర్రేలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా, పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆండ్రూ జాక్ ప్రతినిధి జిల్‌ మెక్ లాగ్‌, ఆయన మృతి తమకు తీరని లోటని అన్నారు. 'స్టార్‌ వార్స్‌' సీరీస్ 7, 8లో ఆండ్రూ జాక్ నటించారు. ఎంతో మందికి భాషపై మెలకువలు నేర్పారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భర్త మరణం గురించి తెలిసిన తరువాత ఆమె స్పందిస్తూ, రెండు రోజుల క్రితం తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఎటువంటి బాధా లేకుండా కన్నుమూశారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles