స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడక్షన్స్ లో నిర్మితమవుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 151వ చిత్రంగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా అభిమానులకు తినబోయే ముందు రుచిని చూపింది. అంటే సైరా చిత్రానికి సంబంధించిన ధియట్రికల్ ట్రైయిలర్ ను విడుదల చేసింది.
‘సైరా’ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. దీనికి తోడు నిర్మాత రాంచరణ్ తేజ్ చిత్రంలోని గ్రాఫిక్స్ కోసం ఏకంగా రూ. 45 కోట్ల వెచ్చించారని, సినిమా కోసం ఏక్కడ ఏ చిన్నా విషయంలోనూ నిర్మాత రాజీ పడటం లేదని తెలియడంతో మెగా అభిమానుల్లో సైరాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో అగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఇవాళ తాజాగా సైరా థియేట్రికల్ ట్రైయిలర్ ను విడుదల చేసింది.
సినీ అభిమానులతో పాటు మెగా అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సైరా ట్రైలర్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు పదుల వయసులో సైతం ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పెట్టి నటించాడు. యాక్షన్ సన్నివేశాలు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.
దర్శకుడు సురేందర్ రెడ్డి తన విజన్ ని కేవలం మూడు నిమిషాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిరు యాక్షన్ ఎపిసోడ్స్ లో అరాచకమే ఇది అనే విధంగా రెచ్చిపోయారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు అలస్యమెందుకు వీడియోను మీరూ చూడండీ..
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more