Varun Tej's Antariksham video attracts audience ఆసక్తి రేపుతున్న ‘అంతరిక్షం’ వీడియో..

Varun tej s antariksham worldwide pre release business

Varun Tej, Aditi Rao Hydari, Antariksham 9000 kmph, Sankalp Reddy, Lavanya Tripathi, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

After scoring two hit movies with 'Fidaa' and 'Tholi Prema' young Hero Varun Tej is now testing his luck with a space thriller 'Antariksham 9000 kmph'. Directed by 'Ghazi' fame Sankalp Reddy.

ఆసక్తిరేపుతున్న ‘అంతరిక్షం’ వీడియో..చిరు ప్రత్యేకశ్రద్ద..

Posted: 12/20/2018 09:03 PM IST
Varun tej s antariksham worldwide pre release business

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' సినిమాను రూపొందించాడు. తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతరిక్షానికి సంబంధించి అంతసేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం సహజం. అసలు ఈ సినిమా ఏయే అంశాలను టచ్ చేస్తూ వెళుతుంది? తాము ఆశించేవి ఈ తరహా సినిమాలో వుంటాయా? అనే విషయాలను తెలుసుకోవాలని అనిపిస్తుంది.

అందువల్లనే తెలివిగా ఈ సినిమా టీమ్ వరుణ్ తేజ్ తో ఒక వీడియో చేసి వదిలింది. ఈ సినిమాలో ఏయే అంశాలు చోటుచేసుకున్నది ఈ వీడియో ద్వారా తెలియజేశారు. సినిమానే ప్రయోగాత్మకం అనుకుంటే, ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా వీడియోతో ఈ సినిమా టీమ్ ప్రయోగాత్మక ప్రయత్నమే చేసింది. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగుందనే చెప్పాలి. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. " రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది" అన్నాడు.

అంతరిక్ష పరిశోధన .. స్పేస్ లోను ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. ఒక సందర్భంలో నా సినిమా .. పెదనాన్న 'సైరా' సినిమా పక్కపక్కనే షూటింగు జరుపుకున్నాయి. అప్పటి నుంచి నా సినిమాకి సంబంధించిన విషయాలను పెదనాన్న ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే చూసి నాకు ఫోన్ చేసి చాలా బావుందంటూ ప్రశంసించారు. పెదనాన్న బాగుంది అంటే సినిమా సగం హిట్టైపోయినట్టేననేది న నమ్మకం" అని చెప్పుకొచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles