Pandem Kodi 2 Teaser Is a Visual Feast విశాల్ ఫ్యాన్స్ ఖుషీ.. పందెం కోడి-2 ట్రైలర్..

Pandem kodi 2 teaser vishal offers a massy treat

PandemKodi2,PandemKodi2 Official First Look-Teaser PandemKodi2 Official Teaser,PandemKodi2 Official Trailer, Pandem Kodi 2Teaser, PandemKodi2 Trailer, PandemKodi2 First look, PandemKodi2 First Look Teaser, PandemKodi, Vishal, Keerthy Suresh,Varalakshmi, Lingusamy, Pandem Kodi 2,Keerthi Suresh,vishal pandem kodi 2,vishal pandem kodi 2 teaser,pandem kodi 2 movie,vishal movies,vishal movie teaser, latest movie news, kollywood, movies, entertainment

Young actor Vishal is making his comeback with Pandem Kodi 2 which is the sequel to his 2005 super hit film Pandem Kodi.

విశాల్ ఫ్యాన్స్ ఖుషీ.. పందెం కోడి-2 ట్రైలర్..

Posted: 08/31/2018 07:45 PM IST
Pandem kodi 2 teaser vishal offers a massy treat

యువ కథానాయకుడు విశాల్ .. కీర్తి సురేశ్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో పందెం కోడి చిత్రానికి సీక్వెల్ గా 'పందెం కోడి 2' చిత్రం రూపొందింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. విశాల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నిర్మాణ యూనిట్ ఇవాళ ఒక టీజర్ ను రిలీజ్ చేసింది.

ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ కట్ చేశారు. దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. ‘నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడమే మొదలుపెట్టాను’ అని విశాల్‌ చెప్తున్న డైలాగ్ కు.. పక్కనే ఉన్న కీర్తి సురేశ్‌ ఈల వేయడం హైలైట్ గా నిలిచింది.

‘ఇది పులి మేక ఆట కాదు..పులి, మేక కలిసి ఆడే ఆట’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pandem Kodi 2  Keerthi Suresh  pandem Kodi  N Linguswamy  tollywood  kollywood  

Other Articles