Mahesh Kathi Criticize Trivikram over Copy Marks | మాటల మాంత్రికుడి పై కత్తి దూసిన మహేష్

Mahesh kathi criticize trivikram

Mahesh Kathi, Trivikram Srinivas, Agnyaathavaasi, Copy Movies, Yandamuri veerendranath, Mahesh Kathi Pawan Kalyan, Mahesh Kathi Mega Fans

Mahesh Kathi Criticize Director Trivikram Srinivas over Copy Marks. In Serial Tweets Mahesh says Trivikram lifts Hollywood scenes and Yandamuri Dialogues.

త్రివిక్రమ్ పై మహేష్ కత్తి విమర్శలు

Posted: 01/03/2018 11:11 AM IST
Mahesh kathi criticize trivikram

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సినిమాలను కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఈ ఉదయం వరుస పోస్టులు చేశాడు. "త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్ లో, సీక్వెన్సులో, ఏకంగా కథనో... ఇలా ఎదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఎదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు" అని ఆరోపించాడు.

మరో ట్వీట్ లో "ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మకొద్ది ఆ మాత్రం రాసే రచయితలు ఎవరులేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు" అని విమర్శలు గుప్పించాడు.

ఇంతకాలం పవన్ ను మాత్రమే అది కూడా రాజకీయాలపరంగా కామెంట్లు చేస్తూ వస్తున్న మహేష్ కత్తి ఈ మధ్య సినిమాలపరంగా కూడా ట్వీట్లు చేస్తుండటం మొదలుపెట్టాడు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ పైనే అక్షరాల తుటాలు గురిపెట్టడం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles