Suriya No Back Step amid Balayya in Race | బాలయ్య సినిమానా? అయితే ఏంటి?

Suriya gang release date

Suriya, Gang Movie, Jai Balayya, Balakrishna, UV Creations, Sankranti Race, Tollywood 2018

Suriya Gang Movie simultaneously release in Telugu. On the Same day Balayya's Jai Simha also Released.

సూర్య గ్యాంగ్ రిలీజ్ డేట్ మారట్లేదా?

Posted: 12/29/2017 04:25 PM IST
Suriya gang release date

తెలుగులో సూర్యకి కోలీవుడ్ తో సమానమైన క్రేజ్ ఉంది. అందుకే ఏకకాలంలో తన చిత్రాన్ని అక్కడా, ఇక్కడా రిలీజ్ చేసేలా ఫ్లాన్ చేసుకుంటాడు. తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన తానా సెరిందా కూట్టమ్ తమిళంలో వచ్చేనెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమాను 'గ్యాంగ్' పేరుతో అదే రోజున విడుదల చేసేందుకు సిద్దమైపోయాడు.

ఈసారి సంక్రాంతికి తెలుగులో పెద్ద పోటీనే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' 10వ తేదీన రిలీజ్ అవుతోంది. రెండు రోజులకే తెలుగులో సంక్రాంతి కానుకగా బాలకృష్ణ సినిమా 'జై సింహా' కూడా అదే రోజున విడుదలవుతోంది. దీంతో ఈ రెండు సినిమాలకి పోటీగా 'గ్యాంగ్' రాకపోవచ్చనే టాక్ వినిపించింది. కానీ 'గ్యాంగ్' వెనక్కి తగ్గడం లేదన్నది తాజా సమాచారం.

అదే రోజున ఆ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు రీలీజ్ చేస్తున్నారు. తెలుగులో వున్న గట్టి పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి మరి. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన 'తానా సెరిందా కూట్టమ్' (గ్యాంగ్)లో కథానాయికగా కీర్తిసురేశ్ నటించగా, రమ్యకృష్ణ, కార్తీక్ లు కీలక పాత్రలు పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya  Gang Movie  సూర్య  గ్యాంగ్ చిత్రం  

Other Articles