Leakage Troubles continued for Agnyaathavasi | అజ్ఞాతవాసికి లీకుల బాధ.. కొత్త రికార్డు నెలకొల్పబోతున్న పవన్ సినిమా?

Pawan movie videos photos leaked

Agnyaathavasi, Agnyaathavasi US Screens, Agnyaathavasi Promotions, Director Trivikram, PSPK 25, Pawan Kalyan Promotions, Agnyaathavasi Records

Leakage Troubles continued for Agnyaathavasi. Agnyaathavasi on-location video Went Viral Pawan enters into Amazon Building. Besides this in US Agnyaathavaasi - Prince in Exile released record screens.

అజ్ఞాతవాసికి లీకుల బాధ.. యూఎస్ లో రికార్డు రిలీజ్!

Posted: 12/05/2017 12:13 PM IST
Pawan movie videos photos leaked

అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు నానాటికీ పెరిగిపోతున్నాయ్. దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పై అందరి కళ్లు పడ్డాయ్. ఇదిలా ఉంటే ఆ చిత్రానికి లీక్ ల బాధ తప్పటం లేదు. గతంలో కొన్ని వీడియోలు విడుదల కాగా.. ఇప్పుడు ఏకంగా చిత్రానికి సంబంధించిన ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది.

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఆఫీస్ దగ్గర షూటింగ్ జరిగింది. అయితే ఆఫీస్ ముందు చాలా మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూ కోసం లైన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు పవన్ అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. ఐడి కార్డు చూపించి లోపలకు వెళతాడు. ఆ సీన్ తాలూకు మేకింగ్ ఇప్పుడు వీడియో రూపంలో లీకైంది. దీనిని బట్టి పవన్ సినిమాలో ఐటి ఉద్యోగిగా కనిపించబోతోన్న వార్త పోస్టర్ తో సగం.. ఈ వీడియోతో కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక్కడ విశేషం ఏంటంటే.. పవన్ చిత్ర షూటింగ్ కోసం అందులో పని చేసే రియల్ ఎంప్లాయిసే స్వచ్ఛందంగా వచ్చి షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్టులుగా పాల్గొన్నారంట.

ఇదిలా ఉంటే ప్రమోషన్లను కూడా చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేస్తున్నారు. మొబైల్ లలో యాప్ రిలీజ్ చేయటంతోపాటు.. డిజిటల్ వేలో చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారంట. అదే సమయంలో పవన్ నుంచి పెద్దగా ఇంటర్వ్యూలో ఉండకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇక యూఎస్ లో ఈ చిత్రాన్ని 209 ప్రాంతాల్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అమెరికాలో 'బాహుబలి 2'ను 126 ప్రాంతాల్లో .. 'ఖైదీ నెంబర్ 150' మూవీని 74 ప్రాంతాల్లో .. 'కబాలి'ని 73 ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. వీటన్నిటికీ మించి 'అజ్ఞాతవాసి'ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ పవన్ కి గల క్రేజ్ .. త్రివిక్రమ్ సినిమాలకి గల మార్కెట్ కారణంగా ఈ స్థాయిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles