No Bathroom in Amala Paul's Residency | అమలాపాల్ మోసం.. బాత్ రూమ్ లేని ఇంట్లో ఉంటుందంట!

Amala paul cheating puducherry transport dept

Amala Paul, Amala Paul Fake address Proofs, Amala Paul Puducherry, Amala Paul Cheating, Amala Paul Fake Proofs, Amala Paul Car Registration Isuue

Car Registration Issue. Amala Paul Submit fake address Proof. She Reside single room without bathroom in Puducherry. Crime Branch Police found Amalapa Paul, Fahad Faasil even Suresh Gopi submit false proofs.

అమలాపాల్ కారు మోసం ఎంతలా అంటే...

Posted: 11/23/2017 05:11 PM IST
Amala paul cheating puducherry transport dept

నటి అమలాపాల్ కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం కొన్నాళ్ల క్రితం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆ వ్యవహారంలో జోక్యం కల్పించుకుని విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరికొందరు స్టార్లు కూడా ఇలా టాక్స్ తప్పించుకునేందుకు అక్కడ కార్లు కొన్నారన్న విషయం వెల్లడైందనుకోండి అది వేరే విషయం.

ఇక కారు రిజిస్ట్రేషన్ కోసం అమల సమర్పించిన పత్రాలన్నీ నకిలీవి కావటమే కాదు.. అందులోని వివరాల గురించి కూడా దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వాణా శాఖ రికార్డుల ప్రకారం ఆమె నివాసం పాండిచ్చేరి లోని సెయింట్ థెరిసా స్ట్రీట్ లో ఉన్న హౌస్ నెం.6గా ఉంది. తీరా చూస్తే అది ఓ ఇంటిలోని టెర్రస్ గది. దానికి బాత్రూమ్ సౌకర్యం కూడా లేదంట.

ఇక మిగతా సెలబ్రిటీలు కూడా దాదాపు ఇలాంటి ఫేక్ రికార్డులనే సమర్పించారు. నటుడు ఫహద్ ఫాజిల్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం అయితే.. అతని నివాసం గురించి అక్కడెవరికీ తెలియదు. సీనియర్ నటుడు సురేష్ గోపీ ఇచ్చిన చిరునామాలో వేరే వ్యక్తి నివాసం ఉంటున్నాడని చెప్పారట చుట్టుపక్కల వారు. ఇలా సెలబ్రిటీలంతా ఫేక్ వివరాలతోనే ఇలా కారు చౌవకగా కోట్లాది కారులకు టాక్స్ ఎగ్గొట్టారన్న విషయం తేటతెల్లమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh