Brad Pitt dating with Angelina Jolie's lookalike | భార్యలా ఉన్న అమ్మాయితో డేటింగ్.. వయసు ఎంతో తెలిస్తే షాక్ తింటారు

Brad pitt date with young actress

Actor Brad Pitt, Brad Pitt Date, Brad Pitt Ella Purnell, Ella Purnell Brad Pitt, Angelina Jolie Ella Purnell, Brad Pitt Affair

Actor Brad Pitt is reportedly eyeing his former wife and actress Angelina Jolie's lookalike Ella Purnell. Purnell, 21, played the young version of Jolie's character in 2014's 'Maleficent'.

హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా పిట్ డేటింగ్

Posted: 10/20/2017 05:45 PM IST
Brad pitt date with young actress

సీనియర్ నటుడు బ్రాడ్ పిట్(53) మరోసారి ప్రేమలో పడ్డాడా? తన కంటే వయసులో 30 ఏళ్లు చిన్నదైన యువతితో డేటింగ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఇదే టాపిక్ హాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఏజెంలినా జోలీతో విడిపోయాక.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఆయన.. జోలికి జిరాక్స్ గా భావిస్తున్న ఎల్లా పుర్నెల్ తో అఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

21 ఏళ్ల ఎల్లా పుర్నెల్ మోడల్ కమ్ నటి. ఇంకో విశేషం ఏంటంటే ఆమె అచ్చం ఏంజెలీనా పోలికలను కలిగి ఉంటుంది. 2014లో వచ్చిన మేల్ ఫిసెంట్ సినిమాలో యంగ్ జోలీ క్యారెక్టర్ లో నటించింది కూడా ఈమె కావటం విశేషం. దీనికి తోడు గతంలో తన ప్రొడక్షన్ కంపెనీలో ఆమెతో కలసి పిట్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట.

ఎల్లా కూడా ఈ టాప్ సెలబ్రిటీపై క్రష్ పెంచుకోవటంతో డేటింగ్ కు సిద్ధమైపోయిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అయితే, వీరిద్దరి ప్రేమాయణం గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు తన మాజీ భర్త డేటింగ్ చేయడాన్ని ఏంజెలినా జీర్ణించుకోలేక పోతోందట. తన పెద్ద కొడుకు మాడెక్స్ కన్నా ఎల్లా ఐదేళ్లు పెద్దది కావటం విశేషం. ఈ మధ్యే జోలి-పిట్ దంపతులు తిరిగి కలవబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. మరి ఈ డేటింగ్ వార్తల్లో వాస్తవమెంతో తెలీదుగానీ.. వీరిద్దరు తిరిగి కలవటం కష్టంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles