ED may summon Amitabh Bachchan in Panama Papaers | పనామా లీక్ లో అమితాబ్ అండ్ ఐష్ కి పెద్ద షాక్.. ఈడీ చిక్కులు తప్పేలా లేవు

Bachchan family likely to be summoned by ed

Amitabh Bachchan, Panama Papers, Enforcement Directorate, Summons, Aishwarya Rai, Ajay Devagan, Bachchan Family Panama Papers, Panama ED Summons

Enforcement Directorate may summon Amitabh Bachchan in The Panama Papers. kin in forex violation probe On April 5, 2016, The Indian Express broke the story on a National Paper reported on several offshore companies belonging to Indians, opened through a company called Mossack Fonseca in Panama. Ajay Devgn also to be summoned by ED. Early Amitabh and Aishwarya submit documents with ED in Panama Papers case.

పనామా కేసులో బచ్చన్ ఫ్యామిలీకి ఈడీ సమన్లు?

Posted: 09/28/2017 08:27 AM IST
Bachchan family likely to be summoned by ed

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి..ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) శాఖ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైపోతుంది. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే వీరి నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ త్వరలో విచారణ చేపట్టనుందని సమాచారం. ఇందుకోసం సమన్లు కూడా జారీ చేసే వీలుందని తెలుస్తోంది.

విదేశాల్లో మోస్సాక్ ఫోన్సెకా పేరిట కంపెనీల్లో ఆస్తులు పెట్టుబడులు పెట్టినట్లు చూపించారని, వాటి పేరుతో కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని పనామా పేపర్లు పేర్కొన్నాయి. వీటిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఈడీ విభాగం నడుం బిగించింది. 1993 నుంచి 1997 మధ్య నాలుగు ఆఫ్ షోర్ షిప్పింగ్ కంపెనీలకు అమితాబ్ డైరెక్టర్ గా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ లోనే ఓసారి నోటీసులు పంపటంతో మంగళవారం బిగ్ బీ, ఐష్ లు అందుకు సంబంధించిన పత్రాలను ఈడీకి సమర్పించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రశ్నించేందుకు ఇప్పుడు ఏకంగా అమితాబ్, ఐశ్వర్య విచారణ చేపట్టనుంది. మరో నటుడు అజయ్ దేవగన్ కు కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయనకు కూడా సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా వీరు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను నిబంధనలను అత్రికమించలేదని, పనామా పేపర్లలో ఆరోపిస్తున్న కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే అమితాబ్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles