Arjun Reddy Hero Morphed Ram Gopal Varma Photo | అర్జున్ రెడ్డి కా బాప్.. రామ్ గోపాల్ రెడ్డి.. హాయ్ చెప్పండి

Rgv in arjun reddy get up

Arjun Reddy Movie, Vijay Devarakonda, Ram Gopal Varma, Ram Gopal Reddy, RGV Becomes RGR, Ram Gopal Varma as Arjun Reddy

Arjun Reddy Hero Edit Director Ram Gopal Varma Photo. Later Posted in FB Gone Viral through Internet.

అర్జున్ రెడ్డి గెటప్ లో రాంగోపాల్ వర్మ

Posted: 09/26/2017 03:40 PM IST
Rgv in arjun reddy get up

పెళ్లి చూపులుతో నైట్ నైట్ కే స్టార్డడమ్.. అర్జున్ రెడ్డితో ఒక్కసారి సెన్సేషన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బయట మాత్రం కాస్త వివాదాస్పద ప్రవర్తనతో వార్త్లల్లోకి ఎక్కటం చూశాం. ఏ విషయాన్ని అయినా రఫ్ అండ్ టఫ్ గా చెబుతుండటం.. పైగా అర్జున్ రెడ్డి నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు విజయ్ కు మరో వర్మ అనే ట్యాగ్ లైన్ ను కట్టబెట్టాయి.

దీనికి తోడు ఆర్జీవీ ఫుల్ సపోర్ట్ కూడా విజయ్ కు ఉండటంతో ఇద్దరూ చెలరేగిపోతున్నారు. ఈ రోజు ట్విట్ట‌ర్‌లో విజయ్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అందులో ఆర్‌జీఆర్‌ (రామ్ గోపాల్ రెడ్డి) ను ప‌రిచ‌యం చేస్తున్నానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. ‘రామ్ గోపాల్ రెడ్డికి హాయ్ చెప్పండి’ అంటూ విజ‌య్ దేవ‌రకొండ పేర్కొన్నాడు.

దీంతో 'నీకు మంచి ఫ్రెండ్ దొరికాడు' అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డికి తండ్రి ఆర్‌జీఆర్' అని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఈ ఫొటోను రామ్ గోపాల్ వర్మ కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles