Jai Lava Kusa Audio Function Highlights

Ntr says jai lava kusa movie god gives opportunity

Jai Lava Kusa, Audio Function Highlights, Jail Lava Kusa Audio NTR Speech, Junior NTR Jai Lava Kusa, Jai Lava Kusa Raashi Khanna, NTR Speech Jai Lava Kusa

NTR Emotional Speech at Jai Lava Kusa Audio Function. Jai Lava Kusa Audio Function Highlights.

జై లవ కుశ.. అరుదైన అదృష్టం.. దేవుడిచ్చాడు: ఎన్టీఆర్

Posted: 09/04/2017 07:35 AM IST
Ntr says jai lava kusa movie god gives opportunity

ఎన్టీఆర్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జైలవకుశ ఆడియో వేడుక ఘనంగా జరిగింది. తండ్రి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, నిర్మాత కళ్యాణ్ రామ్ చిత్ర యూనిట్, నటి రాశీఖన్నా, సాంకేతిక నిపుణులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక నటుడికి అరుదుగా లభించే అవకాశం ‘జై లవ కుశ’ వంటి చిత్రంలో నటించడమని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

‘జై లవ కుశ’ ఆడియో సీడీ ఆవిష్కరించిన అనంతరం తారక్ మాట్లాడుతూ, ‘‘జై లవ కుశ’ ఒక చిత్రం కాదు. ఎందుకంటే, ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం ఒక నటుడికి అరుదుగా భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత నేను ఏం సినిమా చేయాలని బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. మనసుకు నచ్చిన చిత్రం చేయాలా? లేదా ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్లాలా? అనే విషయం నాకు అర్థం కాలేదు.

ఎప్పుడైతే, దర్శకుడు బాబీ వచ్చి ‘జై లవ కుశ’ చిత్రం కథ చెప్పడం జరిగిందో ఆ రోజున గట్టిగా నిర్ణయించుకున్నాను. నా మనసుకు బాగా నచ్చిన కథ జై లవ కుశ. ఈ కథ ఎందుకు బాగా నచ్చిందంటే..బాగా ఎమోషనల్ అయిపోయే పాయింట్ ఏంటంటే..ఈ చిత్రం కేవలం ఒక చిత్రం కాదు. నేను, మా అన్నయ్య కళ్యాణ్ రామ్ తో పాటు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు జానకిరామ్ కూడా ఈ రోజున ఈ స్టేజ్ పై ఉంటే ‘జై లవ కుశ’ అనేది సార్థకమయి ఉండేదేమో!.. అని తెలిపాడరు.

అన్నీ అనుకున్నట్టు అన్నీ జరిగి ఉంటే, మా నాన్నగారి 60వ పుట్టినరోజు కానుకగా ఈ నెల 2న ఈ చిత్రాన్ని ఇద్దామని అన్నదమ్ములిద్దరమూ అనుకున్నాం. కానీ, కుదర్లేదు. 2 అయితే ఏముంది 21 అయితే ఏముందీ, నాన్నగారికి ఈ చిత్రం కానుకగా ఇవ్వాలి. నాన్నా.. అన్నదమ్ములుగా మేము చేసిన చిత్రమిది.. అని చెప్పాలనే కోరిక ఉంది’ అని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. 

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ జ్యూక్ బాక్స్ లో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. కాగా, ఈ నెల 21న విడుదల కానున్న ‘జై లవ కుశ’ చిత్రంలో తారక్ సరసన రాఖీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ద్వారా జై లవ కుశ పాటలు మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jai Lava Kusa  Audio Highlights  NTR Speech  

Other Articles

Today on Telugu Wishesh