Star Producer Cuttings for Mega Hero Too

Dil raju unhappy with fidaa run time

Fidaa, Fidaa Run Time, Dil Raju Chopping Fidaa, Dil raju Shekar Kammula, Shekar Kammula Fidaa, Fidaa Movie Run Time, Sekhar Kammula Dil Raju, Dil raju Angry on Sekhar Kammula

Dil Raju happened to watch the copy of the film Fidaa and he suggested lot of changes. Dil Raju who prefers to dominate during the film’s edit seems to be not bothered about Sekhar Kammula’s work. He is said to have chopped off the film by 25 minutes after he watched the final draft of Fidaa.

కమ్ముల పనితనంపై రాజుగారి అసంతృప్తి!

Posted: 07/13/2017 05:22 PM IST
Dil raju unhappy with fidaa run time

తమ ఫ్యామిలీలోని మిగతా హీరోల్లాగానే వరుణ్ తేజ్ కూడా హిట్ కోసం సతమతమవుతున్నాడు. వరుసగా రెండు డిజాస్టర్లు పడటంతో కనీసం యావరేజ్ కంటెంట్ తోనైనా ఆకట్టుకునేయత్నం అయినా చేస్తాడేమో అనుకుంటే రియలిస్టిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ములతో ఫిదా అంటూ రాబోతున్నాడు.

మళయాళం ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి డెబ్యూ చేస్తున్న ఈ సినిమా ఎన్నారై లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కు రెడీ అయ్యింది. అయితే సినిమాకు భారీగా కోత పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 25 నిమిషాలు సినిమాను నిర్దాక్షిణ్యంగా తీసేయాలని చిత్ర నిర్మాత దిల్ రాజు ఎడిటర్ కు సూచించాడంట. ఇంకేముంది కొన్ని ఫన్నీ సీన్లను లేపేయగా 2 గంటల 15 నిమిషాల రన్నింగ్ టైం దగ్గర ఫిక్సయ్యింది.

అయితే ఇక్కడ అందుతున్న మరో సమాచారం ఏంటంటే.. సాధారణంగా దిల్ రాజు ఏ దర్శకుడికి ప్రీ హ్యాండ్ ఇవ్వడు. కానీ, ఒక్క శేఖర్ కు మాత్రం ఫిదా విషయంలో చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. స్టార్ హీరోల సినిమాలను సైతం సెట్స్ లో ఉండి పర్యవేక్షించే రాజు ఇలా చేస్తున్నాడా? అని ఎవరూ నమ్మలేకపోయారు. కానీ, దీనిని కమ్ముల సరిగ్గా వాడుకోలేకపోయాడని టాక్. చిత్రం ఫైనల్ అవుట్ పుట్ చూసిన రాజు అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు ఇలా కోతలను దగ్గరుండి మరీ చేసినట్లు స్పష్టమౌతోంది. త్వరలో ఆడియో రిలీజ్ చేసి, ఆగష్టు 21న ఫిదాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fidaa Movie  Dil Raju  Run Time  Sekhar Kammula  

Other Articles