Record Screens for Nani Niinu Kori Premiers in US

Records screens for nani ninnu kori

Nani, Nani Ninnu Kori, Nani New Record, Nani Overseas Craze, Nani Ninnu Kori Premiers, Nani US Premiers, Nani Ninnu Kori Screens, Nani New Movie, nani Huge Release US, 500 Screens for Nani

Nani New Record with Ninnu Kori US Premiers. 500 Screens allotted for this romantic entertainer.

నాని.. ఎంత ఎదిగిపోయాడసలు?

Posted: 06/29/2017 04:19 PM IST
Records screens for nani ninnu kori

నేచురల్ స్టార్ నానికి దాదాపు అన్ని వర్గాల్లో ఫ్యాన్స్ తయారయ్యారు. ఏడాదికి మూడు సినిమాలు, వరుసగా ఆరు హిట్లు ఇది చాలదా నాని కెరీర్ ఎంత ఊపు మీద ఉందో చెప్పడానికి. పైగా అన్ సీజన్ ఫిబ్రవరిలో నేను లోకల్ తో సాలిడ్ హిట్ నే అందుకున్నాడు. ఇక ఇప్పుడు నిన్ను కోరితో మళ్లీ ఆ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు రెడీ అయిపోయాడు. గోపీ సుందర్ పాటలు ఇప్పటికే మ్యూజికల్ హిట్ టాగ్ లైన్ ను ఇచ్చేశాయి.

నాని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్ నే చేస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాలను భారీ రేట్లతో రైట్స్ కొనుక్కొని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చేతులు కాల్చుకుంటుంటే.. నాని సినిమాలు మాత్రం ఈజీగా లాభాలను అందించేస్తున్నాయి. అందుకే నిన్ను కోరి కోసం అక్కడ భారీగానే ఫ్లాన్ చేస్తున్నారు.

కేవలం ఒక్క అమెరికాలో ప్రీమియర్ల కోసమే 500 స్క్రీన్లను అక్కడ కేటాయించేశారు. మాములుగా బడా స్టార్ల సినిమాలకు ఈ రేంజ్ లో స్క్రీన్లను కేటాయిస్తూ ఉంటారు. కానీ, నాని మీద నమ్మకంతో ఈ రేంజ్ లో భారీగా ఫ్లాన్ చేయటం మాత్రం విశేషమే. ఫారిన్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించిన చిత్రం కావటంతో ధీమాగా ఉన్నారు. జూలై 6న సాయంత్ర 6 గంటలకే ఈ సినిమా షోలు అక్కడ పడిపోతున్నాయి. డీవీవీ దానయ్య యూనివర్సల్ బ్యానర్ లో శివ నిర్వానా డైరక్షన్ లో రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నివేదా థామస్ హీరోయిన్ గా, ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori  US Premiers  

Other Articles