Nene Raju Nene Mantri Theatrical Trailer Review

Nene raju nene mantri theatrical trailer released

Rana Daggubati, Rana Daggubati New Trailer, Nene Raju Nene Mantri Theatrical Trailer, Nene Raju Nene Mantri Trailer, Nene Raju Nene Mantri Trailer Review, Rana Political Punches, Rana Punches Chandrababu, Rana TDP Punches, Rana New Movie, Rana Kajal Nene Raju Nene Mantri

Rana Daggubati Nene Raju Nene Mantri Theatrical Trailer Out. Complete Political Satires in Teja's Directorial Venture.

నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్.. మొత్తం వాళ్లనే టార్గెట్ చేస్తూ డైలాగులు

Posted: 06/23/2017 10:37 AM IST
Nene raju nene mantri theatrical trailer released

టాలీవుడ్ హ్యాండ్స్ మ్ హంక్ రానా దగ్గుబాటి కొత్త చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్ర ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. సురేష్ ప్రోడక్షన్ బ్యానర్ పై దర్శకుడు తేజ దీనిని రూపొందిస్తున్నాడు. కంప్లీట్ పొలిటికల్ సెటైర్ గా మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. 

ఇక ట్రైలర్ లో జేపీ వాయిస్ తో రానా క్యారెక్టర్ తోపని మొదలుపెట్టి ఆపై జోగేంద్ర(రానా), రాధా(కాజల్ ) ల రొమాన్స్ ను ఓ ఓల్డ్ సాంగ్ తో ముందుకు తీసుకెళ్లాడు. తనకు అన్యాయం జరగటం, జోగేంద్ర పూర్తిగా మారిపోయి (మేకోవర్ తోసహా) రాజకీయాల్లోకి దిగటం చూపించారు. కేథరిన్ సిగరెట్ తాగే ఫోజు, ‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా ము* కింద ఉండాలని’  రానా చెప్పే డైలాగ్ బహుశా ఏదైనా నేతను ఉద్దేశించి చేసిందేమో అన్నట్లు అనిపించకమానదు.   

ఇక తనికెళ్ల భరణి నేను సీఎం అంటే.. స్టార్ హోటల్ లో వంద మంది ఎమ్మెల్యేలను పెడితే సాయంత్రానికి నేను అవుతా సీఎం అంటూ చెప్పే డైలాగ్ ఎవరిని ప్రస్తావించినట్లో తెలిసిందే. చివర్లో  పాముల పుట్టకు చీమలు సాయం చేయాల్సిందేనంటూ కార్యకర్తలపై కూడా సెటైర్ వేయటం అలా ముగిసింది ట్రైలర్. విలన్ గా వెంకీ ఫేం అశుతోష్ రానా కనిపించబోతున్న నేనే రాజు నేనే మంత్రి ఆగష్టులో రిలీజ్ కానుంది. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Nene Raju Nene Mantri  Trailer Review  

Other Articles