Manjima Mohan Fumes on Naked Heroines Comment

Manjima cool answer to bold comment

Actress Manjima Mohan, Manjima Mohan Bold Comments, Manjima Mohan Exposing Comments, Manjima Mohan Bold, Mallu Actress Manjima, Manjima Mohan Tamil Movies, Manjima retart comments, Manjima Heroines Dresses Comments, Naked Heroines Comment, Manjima Mohan Fire

Actress Manjima Mohan has been interacting with her fans on her social networking sites. One of her fans has declared that the audiences will come to theaters only to see heroines in short dresses but not for good movie. Manjima even though got irked by the fan’s comment replied in a cool way. She said that audiences do come to theaters to watch a good cinema but not to watch heroines while they expose. Manjima added that whoever thinks in vice-versa should change their minds as that is not correct thinking.

బోల్డ్ కామెంట్ కు మాంజిమా కూల్ ఆన్సర్

Posted: 05/11/2017 05:40 PM IST
Manjima cool answer to bold comment

తమపై పడే కౌంటర్లకు రియాక్షన్ ఇవ్వకపోతే ఆ హీరోయిన్ పరిస్థితి అంతే. ఈ విషయంలో బాలీవుడ్ భామలు చాలా అడ్వాన్స్ గా ఉండగా, మన హీరోయిన్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఘాటు వ్యాఖ్యలకు సూటిగా ముఖంపై గుద్దేసినట్లు సమాధానాలిచ్చేస్తున్నారు. మల్లూ బ్యూటీ మాంజిమా మోహన్ కూడా ఇప్పుడు ఇలాంటి పనే చేసింది.

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కుట్టి సోషల్ మీడియాలో సరదాగా ఓ అభిమాని చేసిన పిచ్చి కామెంట్ కు గట్టి సమాధానం చెప్పింది. సినిమాల్లో కేవలం న్యూడ్ సీన్లు.. పొట్టి బట్టల్లో ఉన్న హీరోయిన్లను చూసేందుకే జనాలు థియేటర్లకు వస్తారని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.

దానికి కౌంటర్ ఇచ్చిన మాంజిమా ‘జనం థియేటర్లకు వచ్చేది హీరోయిన్లను నగ్నంగానో, కురచ దుస్తుల్లోనో చూడ్డానికేనని మీరు భావిస్తే అది చాలా తప్పుడు అభిప్రాయం. మంచి సినిమాలను ఆస్వాదించేందుకే ప్రజలు థియేటర్లకు వస్తారు’ అంటూ కూల్ గా సమాధానం చెప్పింది. గ్లామర్ అనేది సినిమాలో ఓ పార్టే తప్ప.. అదే సినిమాను డిసైడ్ చేస్తుందన్న అతగాడి మైండ్ సెట్ తప్పని ఒక్క మాటతో తేల్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Manjima Mohan  Bold Comment  Retart  

Other Articles