జస్ట్ తెలుగు శాటిలైట్ రై(రే)ట్లు దాదాపు 50 కోట్లు.. రీజనబులేనా? | Baahubali 2 and Spyder telugu Satellite Rights Sold For A Bomb.

Baahubali 2 and spyder satellite rights

Baahubali 2 Satellite Rights, SPYder Satellite Rights, Baahubali 2 and SPYder, Baahubali 2 and Spyder Satellite Rights, SPYDER Zee Channel, Baahubali 2 Star TV, Baahubali 2 Star MAA, Baahubali 2 Satellite Rights, Mahesh Babu Spyder Satellite Rights

Baahubali 2 and Spyder Satellite Rights Sold For A Bomb for telugu version. Zee Channel grabbed with 15 crores for SPYder and Star Maa bagged Baahubali The Conclusion for 30 Crores.

బాహుబలి-2 , స్పైడర్ శాటిలైట్ రైట్స్ 45 కోట్లు

Posted: 04/13/2017 03:58 PM IST
Baahubali 2 and spyder satellite rights

టాలీవుడ్ లో సమ్మర్ కి మోస్ట్ అవెయింటింగా ఉన్న రెండు భారీ చిత్రాల శాటిలైట్ రైట్స్ గురించి ఇప్పుడు సౌత్ లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. అందులో ఒకటి బాహుబలి-2 కాగా, మరోకటి మహేష్ స్పైడర్ చిత్రం. ఈ రెండు చిత్రాల శాటిలైట్ రైట్స్ కేవలం తెలుగు వర్షన్ కోసమే 45 కోట్ల దాకా పలకటం విశేషం.

ఓ వైపు షూటింగ్ కొనసాగుతుండగానే మహేష్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ. 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలున్నాయిని చెబుతున్నారు. భారీ మొత్తం చెల్లించిన సదరు ఛానల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ రైట్స్ కోసం సదరు ఛానల్ ఏకంగా రూ. 26 కోట్లు చెల్లించిందట. కేవలం 15 కోట్లకు తెలుగులోనే హక్కులను ఓ ఛానెల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న బాహుబలి ది కంక్లూజన్ ను 30 కోట్లు పెట్టి స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేయటం చర్చగా మారింది. మొదటి పార్ట్ ను సుమారు 15 కోట్లను కొనుగోలు చేసిన ఇదే ఛానెల్(అప్పుడు ‘మా’ గా ఉంది) ఇప్పుడు రెండో పార్ట్ ను డబుల్ రేట్ కు కొనటం విశేషం. అయితే మొదటి పార్ట్ టీఆర్పీ ని లెక్కేసుకుంటే మాత్రం ఆ ధర చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. 

డిజాస్టర్ అయిన బ్రహ్మోత్సవం ను కూడా రిలీజ్ కు ముందు జీ ఛానెల్ 10 కోట్లకు పైగానే పెట్టి కొనుగోలు చేసింది. కానీ, దాని టీఆర్పీ ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. బాహుబలి ది బిగినింగ్ విషయంలోనూ ఏ మంత గొప్పగా లేదు. ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ మరీ అంత రేట్లు పెట్టి కొనుక్కోవటం ఛానెళ్లకు మంచింది కాదని ట్రేడ్ అనాలసిస్టులు సలహా ఇస్తున్నారు.  కేవలం తమ బిజినెస్ కోసం ఛానెళ్ల మధ్య పోటీపెట్టి మరీ ఎక్కువ రేట్లకు హక్కులను అమ్మేసి చేతులు దులుపుకోవటం కూడా నిర్మాతలకు సరికాదనేది వారి అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  SPYder  Satellite Rights  

Other Articles