నాకే కుక్కలంటూ తీవ్ర విమర్శలు.. బండ్ల, ఫ్యాన్స్ పై వర్మ ట్వీట్లు... | RGV again tweets on Pawan Fans.

Rgv tweets on bandla and pawan fans

Ram Gopal Varma, RGV Tweets, RGV Pawan kalyan Fans, RGV Bandla Ganesh, Ram Gopal Varma Controversy Tweets, RGV PK Fans, Ram Gopal Varma Counter, Varma Tweets

Ram Gopal Varma's Strong Reply To Bandla Ganesh and Pawan Kalyan Fans.

బండ్ల, పవన్ ఫ్యాన్స్ పై వర్మ ట్వీట్లు

Posted: 03/28/2017 01:25 PM IST
Rgv tweets on bandla and pawan fans

వివాదాల రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో హాట్ డిస్కషన్ కు తెర లేపాడు. ప్రత్యేకంగా పవన్ కాటమరాయుడు సినిమా రిలీజ్ తరువాత మరోసారి పవర్ స్టార్ ను టార్గెట్ చేశాడు. సినిమా రిజల్ట్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని కూడా తనదైన స్టైల్ లో కామెంట్ చేయటంతో అదే స్థాయిలో ఇప్పుడు ఎదురుదాడి జరుగుతోంది. ముఖ్యంగా బండ్ల గణేష్ అయితే ఎక్స్ పయిర్ అయిపోయిన ట్యాబ్ లెట్ అంటూ వర్మపై మండిపడ్డాడు కూడా. ఇక 'హఠాత్తుగా మరణించిన వర్మ. సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న ఓ పాత ఫోటోతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

దీంతో రాజమౌళి, పవన్ కాంబోపై పాజిటివ్ ట్వీట్ వేసినట్లే వేసి, మరోసారి విమర్శలు సంధించాడు. బండ్ల గణేష్ ను ఇండైరక్ట్ గా కుక్కలతో పోలుస్తూ ఘాటైన విమర్శలు చేశాడు. మొరిగే కుక్కలు నాకే కుక్కలు చాలా బెటర్ అని, అవి కనీసం కరవటం ఎలాగూ మిగతా వాటికి నేర్పిస్తాయని, కానీ, నాకే కుక్కలు మాత్రం ఎలుకల కన్నా హీనమంటూ ట్వీట్ వేశాడు.

ఇక పవన్ అభిమానులకు కూడా చురకలంటించాడు. 'లవ్ యు మై డియర్ స్వీట్ డార్టింగ్ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్. మీ అందరికీ నా బిగ్ హగ్' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్ ను గొర్రెలన్న వర్మ, 'నేను మూడు జన్మల ముందే చనిపోయాను. ప్రస్తుతం ఇక్కడ బతికున్న నేను దెయ్యాన్ని, దెయ్యాలు చనిపోవు, అవెప్పుడు చావులో బతికే ఉంటాయి అంటూ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్లు ఎంత దూమారం రేపుతాయో చూడాలి మరి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Pawan Kalyan  Bandla Ganesh  Pawan Fans  

Other Articles

Today on Telugu Wishesh