మహేష్ చెర్రీతోనే కాదు చిరుతో కూడా... | Megastar surprises Super Star.

Chiru visits mahesh babu movie sets

Chiranjeevi, Chiranjeevi Mahesh Babu, Chiranjeevi Murugadoss and Mahesh Babu, Santosh Sivan Mahesh Babu Movie, Chiru Mahesh Sets, Chiranjeevi Mahesh Babu, Mahesh Babu#23, Mahesh Babu New Movie, Mega Guest for Mahesh Babu, Chiru Monitoring Mahesh Movie, Mega Super Moment, Mega Star Super Star

Chiranjeevi visited sets of Mahesh Babu-Murugadoss film. The film's cinematographer Santosh Sivan posted a picture on his Twitter page, where Chiranjeevi could be seen looking at the monitor along with the director AR Murugadoss and Mahesh.

మెగా సూపర్ మూమెంట్: మహేష్ సెట్లో చిరు సందడి

Posted: 03/07/2017 07:46 AM IST
Chiru visits mahesh babu movie sets

ప్రజెంట్ బాలీవుడ్ ట్రెండ్ నే టాలీవుడ్ కూడా ఫాలో అయిపోతుంది. ఇంతకాలం పోటీ పేరుతోనో, లేక ఎవరికి వారు అన్న చందాన షూటింగ్ లతో బిజీ అయిపోతున్న హీరోలు ఎడ పెడ మొహం వేసుకుని ఉండటం చూశాం. కానీ, ఇప్పుడా సిచ్యుయేషన్ మారింది. ఒకరి షూటింగ్ స్పాట్ లో మరోకరు దర్శనమివ్వటం, సెట్ లో సందడి చేయటం చూస్తున్నాం. మెగాస్టార్ చిరు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఖైదీ షూటింగ్ లో ఉండగా పక్కనే బాహుబలి-2 జరుగుతుండటంతో వెళ్లి ప్రభాస్ ను ఆత్మీయంగా కౌగిలించుకుని బెస్ట్ విషెస్ చెప్పటం చూశాం.

ఇప్పుడు మహేష్ బాబు కు కూడా అలాగే స్వీట్ షాక్ ఒకటి ఇచ్చాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ బాబు-మురగదాస్ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. పక్కనే మీలో ఎవరు కోటీశ్వరుడు టివి షో షూటింగ్ లో ఉన్న చిరంజీవి.. విషయం తెలుసుకుని ఆ సెట్ కి వచ్చాడు.

ఈ విధంగా మహేష్ సినిమా సెట్టుకు మెగా అతిథి వచ్చారని.. చెబుతూ ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు కాసేపు అక్కడకే గడిపిన చిరు, షూటింగ్ ను తిలకించటమేకాదు, మానిటర్ లో కాసేపు మహేష్, మురగదాస్ తో కలిసి ఇలా అవుట్ పుట్ ను తిలకిస్తున్నాడు. అన్నట్లు మెగావారసుడు రాంచరణ్ తో మహేష్ బాబు స్పెషల్ ఫ్రెండ్ షిఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  Chiranjeevi  

Other Articles

Today on Telugu Wishesh