అనవసర బిల్డప్ లు వద్దు.. మనకేం తక్కువ? | Dasari Narayana Rao on telugu movies.

Dasari challenge star directors

Dasari Narayana Rao, Dasari Serials, Dasari Narayana Rao Challenge, Dasari Narayana Rao Tollywood Directors, Dasari Abhishekam Serial, Dasari on Tollywood movies, Dasari telugu movies

Dasari Narayana Rao Challenges Star Directors to direct serials 100 days. And added we insult over selves compare to other south industries.

దాసరి కామెంట్: మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం

Posted: 01/23/2017 12:44 PM IST
Dasari challenge star directors

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాసరి నిర్మించిన అభిషేకం అనే సీరియల్ 2500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బిరామిరెడ్డి లలితకళా పరిషత ఆధ్వర్యంలో యూనిట్ ను సత్కరించాడు. ఈ సందర్భంగా స్టార్ దర్శకులకు దర్శకరత్న కొత్త ఛాలెంజ్ విసిరాడు.

ఈ రోజుల్లో సీరియళ్లను నిర్మించటం, దర్శకత్వం వహించడం చిన్న విషయం కాదన్న ఆయన ఇప్పుడున్న దర్శకుల్లో ఎవరైనా ఓ వంద ఎపిసోడ్లు చేస్తే వారికి పాదాభివందనం చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు మన గొప్పతనాన్ని మనమే కించపరుచుకుంటున్నామంటూ తెలిపాడు.

‘మీ అభిమాన దర్శకుడు ఎవరు’ అని ఏ తెలుగువాడినైనా అడగండి. ఏ మణిరత్నం పేరో.. బాలచందర్ పేరో చెబుతాడు. అంతేకానీ, కేవీ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారన్న విషయం వారికి గుర్తుకురాదు. పోనీ.. మీకు నచ్చిన సినిమా ఏది? అని అడగండి. ఊరూ పేరు తెలియని దర్శకుడు తీసిన ఓ ఇంగ్లీష్ సినిమా పేరు చెబుతారు. అదే పక్కనే ఉన్న కోలీవుడ్ శాండల్ వుడ్, మల్లూ వుడ్ లు అలా కాదు. ముందు మేం.. మా తరవాతే ఎవరైనా అంటారు. ఇక్కడ మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం అంటూ చెప్పుకోచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana rao  Serials  Directors  Challenge  

Other Articles