జై లవ కుశ కే ఓటు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా? | Jai Lava Kusha Muhurtham fixed.

Ntr next movie launch date fix

Junior NTR, NTR 27th movie, NTR Bobby movie, NTR next release date, NTR 2017 movies, NTR Jai lava kusa, Jai Lava Kusa Movie, NTR triple role movie,

NTR 27th movie Jai Lava Kusha shooting Muhurtham fix. Bobby direct that movie. Kalyan Ram producing on NTR arts banner. Anupama Parameswaran and niveda thomas in lead roles.

ఎన్టీఆర్ నెక్స్ట్ డేట్లు ఫిక్సయ్యాయి

Posted: 01/18/2017 01:39 PM IST
Ntr next movie launch date fix

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ, తన తర్వాతి సినిమా అనౌన్స్ చేయడానికే కోసం మూడు నెలల సమయం తీసుకున్నాడు. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లను లైన్ నుంచి తప్పించి చివరకు పవర్ ఫేం బాబీతో మూవీని ఖాయం చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. అయితే అల్రెడీ నెల నుంచి దీని గురించే చర్చలు జరుగుతున్నా ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు.

రీసెంట్ గా ఈ చిత్ర ముహుర్తమే కాదు, రిలీజ్ డేట్ ను కూడా దాదాపు కన్ఫర్మ్ చేశాడంట నిర్మాత కళ్యాణ్ రామ్. ఇందుకోసం ఇప్పటికే 'జై లవ కుశ' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించేశారు. ఫిబ్రవరి 11న యంగ్ టైగర్ 27వ సినిమాను అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి.. వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు ఆగష్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయారంట కూడా.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడని, అందుకే ఈ టైటిల్ పెట్టారని చెప్పుకుంటున్నారు. చేస్తాడని.. జై.. లవ..కుశ.. ఆ రోల్స్ పేర్లని అందుకే ఈ టైటిల్ కి ఫిక్స్ అయ్యారని టాక్. వరుసగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ సీకే మురళీధరన్ ఈ సినిమాకు పని చేయనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava kusa Movie  director Bobby  

Other Articles