త్రీమచ్: నో బికినీ.. నో లిప్ లాక్.. నో రొమాన్స్.. ఇంకేం చేస్తావ్ ! | Nayanatara no for glamour show.

Nayanatara tough conditions before sing movies

Nayanatara, Nayanatara expose, Nayanatara 2017, Nayanatara conditions, Nayanatara no for romance, Nayanatara tough conditions, Nayanatara Story changer, Nayanatara affair, Nayanthara Vignesh

Nayatara conditions before signing movies. Nayan says No for glamour show.

నయనతార కండిషన్లతో కొత్త తలనొప్పి

Posted: 01/18/2017 10:18 AM IST
Nayanatara tough conditions before sing movies

అప్ కమింగ్ హీరోయిన్ల సంగతి ఎలా ఉన్నా సరే... స్టార్ హీరోయిన్లు మాత్రం తమ గొంతెమ్మ కోరికలతో మేకర్లను తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కొందరైతే సినిమాకు సైన్ చేసే సమయంలో ఒకలా, షూటింగ్ జరిగే సమయంలో మరోలా ప్రవర్తిస్తూ తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

అయితే అవకాశాల కోసం తాపత్రయపడే వారి సంగతి ఎలా ఉంటుందో తెలీదుగానీ, కోరి కోరి వస్తే మాత్రం వ్యవహారం నయనతారలా ఉంటుందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. సౌత్ లో నయన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారీ పారితోషకం తీసుకుంటున్నప్పటికీ, కొత్త వాళ్లతో కూడా చేసేందుకు సిద్ధమైపోతుండటంతో ఆమెకే అంతా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో కథ నచ్చినా సరే ఆమె పెట్టే కండిషన్లకు సంప్రదిస్తున్న నిర్మాతలు, దర్శకులు తలలు పట్టుకుంటున్నారంట.

అందాల ఆరబోతకే కాదు.. సన్నివేశానికి అవసరమైన మసాలాను కూడా కట్ చేయాల్సిందేనని కొత్త కండీషన్స్ పెడుతోందంట. ముందు వాటికి ఒప్పుకుంటూనే తన కాల్షీట్లు ఇస్తానని కూడా తేల్చి చెప్పేస్తుందంట. నో లిప్ లాక్.. నో రొమాన్స్.. అంటూ తేల్చి చెప్పటంతో నయన్ కోసమే వెళ్లేవాళ్లు చేసేది లేక తమ కథలోనే మార్పులు చేసుకునే పనిలో పడ్డారు. ఏదైనా ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందని క్రిటిక్స్ నయన్ పై విరుచుకుపడుతున్నారు. అయితే ఇంతకు ముందు సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ తో పీకలలోతు ప్రేమలో ఉంది గనుకే అతను చెబితేనే ఇలా చేస్తోందంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Nayanatara  Exposing  Conditions  upcoming movies  

Other Articles

Today on Telugu Wishesh