సెన్సార్ టాక్ ఏంటి? రిలీజ్ క్లాష్ తప్పేలా లేదు | Khaidi No 150 censor fnished.

Khaidi no 150 no clarity on release

Chiranjeevi, Bala Krishna, Khaidi No 150, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Release date, Khaidi Censor details, Khaidi No 150 release date,Satakarni release date, GSP Khaidi Clash, Satakarni Khaidi release dates, Gautamiputra Satakarni, Khaidi No 150, Khaidi and satakarni Release dates, Chiru Balayya Clash

No Clarity on Khaidi No 150 and Gautamiputra Satakarni Release dates.

ఖైదీ సెన్సార్ అయిపోయింది.. రిలీజ్ డేట్?

Posted: 12/30/2016 10:26 AM IST
Khaidi no 150 no clarity on release

మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్లను రెగ్యులర్ గా ఫాలో అవుతూ అభిమానులు ఆనందపడిపోతున్నారు. ముఖ్యమైన సెన్సార్ పని కూడా అయిపోవటంతో ఫోకస్ ప్రీ రిలీజ్ పైకి మళ్లీపోయింది. యూ బై ఏ సర్టిఫికెట్ తో 2 గంటల 27 నిమిషాల రన్ టైం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 4న జరిగే వేడుక కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలువడింది.

బిజినెస్ భారీగా జరగటంతో సినిమా అదే స్థాయిలో ప్రీమియర్ షోలు వేయాలన్న ఫ్లాన్ లో ఉన్నాడంట నిర్మాత చెర్రీ. పోటీగా మరో రెండు చిత్రాలు ఉండటంతో కలెక్షన్లు కుమ్ముకోవాలంటే మరో మార్గం లేదన్న ఆలోచనలో పడ్డాడంట. ఈ మేరకు జనవరి 10న యూఎస్ ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించున్నట్లు ఓ సమాచారం అందింది. అంటే ఇక్కడ జనవరి 11న రిలీజ్ అవుతుందన్న మాట. త్వరలో దీనిపై ఓ అఫీషియల్ ప్రకటన రావొచ్చనే అంటున్నారు.

అయితే ఆ మరుసటి రోజే (జనవరి 12న) బాలయ్య వందో చిత్రం శాతకర్ణి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు మేకర్లు. అదే జరిగితే గనుక ఏదన్న ఒక చిత్రం బాగా నష్టపోక తప్పదు. సెలవులే అయినప్పటికీ వీకెండ్ లో కాకుండా రెగ్యులర్ డేస్ లో సినిమా రిలీజ్ అవుతోంది. ఆ లెక్కన్న తర్వాత విడుదలయ్యే(ఒకవేళ రిలీజ్ అయితే) శాతకర్ణికే ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రిలీజ్ విషయంలో ఇప్పటిదాకా ఏ నిర్మాత స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవటంతో అభిమానుల్లో కాస్త గందరగోళమే నెలకొంది. చూద్దాం... ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Gautamiputra Satakarni  Release dates  Khaidi censor report  

Other Articles