అక్కడ సన్నీ.. ఇక్కడ బన్నీ తెగ వెతికేస్తున్నారు.. allu arjun the most searched hero of the year

Sunny leone in bollywood and bunny in tollywood has most searched celebs

allu arjun, most searched, google, mahesh babu, prabhas, junior ntr, pawan kalyan, janasena, balakrishna, tollywood stylish star, tollywood, latest movie news

bunny, the stylish star of tollywood stans as the most searched telugu hero of the current year. behind bunny falls mahesh babu, prabhas, junior ntr, pawan kalyan

అక్కడ సన్నీ.. ఇక్కడ బన్నీ.. తెగ వెతికేస్తున్నారు..

Posted: 12/17/2016 04:20 PM IST
Sunny leone in bollywood and bunny in tollywood has most searched celebs

సెలబ్రిటీగా మారామంటే చాలు అటోమెటిక్ గా మనకు తెలియకుండానే ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది. అలా జరిగే మౌత్ పబ్లిసిటీలో భాగంగా ఆయా వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాలని, మరింత సమాచారం, వివరాలు కూడా తెలుసుకోవాలని అభిమానులు అనుకోవడంలో తప్పులేదు. అయితే ఇందుకు వున్న ఒకే మార్గం అంతర్జాలం అదేనండీ ఇంటర్ నెట్. మరీ ముఖ్యంగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ను అశ్రయించే వారి సంఖ్య అధికం. ఈ క్రమంలో అభిమానులు అధికంగా ఎవరెవర్నీ సెర్చ్ చేస్తున్నారన్న విషయాలు కూడా అప్పడప్పుడూ గూగుల్ మనకందిస్తుంది.

దీంతో అక్కడ సన్నీ టాప్ లో నిలిచిందన్న వార్తలను ఇటీవలే అందుకున్న మనకూ ఇటు తెలుగులో మాత్రం బన్నీ దుమ్ములేపుతున్నాడని సమాచారం అందింది. వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఆన్ లైన్ లోనూ రికార్డ్ లు సృష్టిస్తున్నాడు. 2016లో ఆన్ లైన్ లో అతి ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ. మహేష్ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ.

ఆ తరువాత స్ధానాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ లు నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక వీళ్లంతా యంగ్ హీరోలైనప్పటికీ.. వీరితో పోటీ పడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాన్ ను కూడా బాగానే వెతికేసారట తెలుగు వాళ్లు. అయినా పవన్ గురించి తెలియక కాదు.. ఆయన రాజకీయంగా ఏం చేస్తున్నారోనని వెతికేవారి సంఖ్యే అధికంగా వుండవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  most searched  google  tollywood  latest movie news  

Other Articles