జయ మృతిపై కమల్ వివాదపు ట్వీట్.. వర్మ మాత్రం టచ్ చేశాడు... | Kamal Haasan tweet on Jayalalithaa demise.

Kamal and rgv tweets on jayalalithaa

Ram Gopal Varma, Kamal Haasan, Kamal tweet on jayalalithaa death, Varma tweet Jayalalithaa, Varma Jayalalithaa, Jayalalithaa RGV, Ram Gopal Varma Jayalalithaa, Jayalalithaa Kamal Haasan, Varma kamal Haasan Jayalalithaa

Kamal Haasan controversial tweet on jayalalithaa demise, While Ram Gopal Varma praised Amma.

కమల్-వర్మ ఎంత తేడా ఉందో...

Posted: 12/06/2016 04:15 PM IST
Kamal and rgv tweets on jayalalithaa

దేశం మొత్తం అమ్మ అస్తమయం గురించే దీర్ఘంగా చర్చించుకుంటోంది. ముఖ్యంగా తమిళసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. సాధారణ ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులు అంతా ఆమె మృతి నివాళులు అర్పిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్లో జయలలితకు నివాళులు అర్పించాడు.

జయలలితతో ఉన్న ఓ పాత ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి శ్రధ్ధాంజలి ఘటించాడు వర్మ. క్షణక్షణం ను గానూ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు వర్మ. అప్పుడు వేడుకలకు హాజరైన జయలలిత ఆ అవార్డును వర్మకు అందజేసింది. దానిని పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన జీవితంలో అవార్డు అందుకోవడానికి వెళ్లిన ఏకైక పంక్షన్ అదేనన్న వర్మ, వన్ అండ్ ఓన్లీ ఆమ్మ చేతుల మీదుగా అందుకున్నానంటూ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్ లో జయలలిత లేని తమిళనాడును ఊహించుకోలనన్న వర్మ, సూపర్ స్టార్ టూ సూపర్ పొలిటీషియన్.. వాట్ ఏ జర్నీ అంటూ తెలిపాడు. అందం ఫ్లస్ దయ ఫ్లస్ గౌరవం అంటే ఆమె అంటూ ఇంకో ట్వీట్ చేశాడు. మొత్తానికి మిగతా వారి విషయంలో ఎలాంటి వైఖరిని ప్రదర్శించినప్పటికీ, జయను జ్నప్తికి తెచ్చుకుని వర్మ బాగానే ఫీలవుతున్నాడని అర్థమౌతోంది.

 

ఇదిలా ఉంటే లోకనాయకుడు కమల్‌హాసన్‌ జయలలితపై పెట్టిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. తమిళంలో ‘జయలలిత మీద ఆధారపడి బతుకుతున్న వారందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అని జయ మృతికి నివాళిగా కమల్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో అగ్గి రాజుకుంది. ఇది జయలలిత అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా మండించింది.

ఇంకా, అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే కమల్‌ ఇలా ఎద్దేవా కామెంట్లు చేయటం విమర్శలకు తావిచ్చింది. కమల్ అభిమానులు కూడా ఈ చర్యను తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ‘నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నానం’టూ ఓ అభిమాని రీ-ట్వీట్‌ చేశాడు. కాగా, విశ్వరూపం సమయంలో విడుదలకు అడ్డంకులు కలిగించిందనే కోపం కమల్ కి ఇంకా ఉందేమోనని కొందరు వ్యాఖ్యానించటం విశేషం.

అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి ‘పంచె కట్టుకున్న తమిళుడు ఈ దేశానికి ప్రధాని కావాలి’ అని కమల్‌ అన్నాడు. దీంతో జయలలితకు కోపం వచ్చి  ‘విశ్వరూపం’ సినిమాకు అడ్డంకులు సృష్టించిందని టాక్ నడిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Jayalalithaa Demise  Ram Gopal Varma  

Other Articles