సల్మాన్, గర్ల్ ఫ్రెండ్ విడిపోవటం మీడియా సృష్టేనా? | Salam Khan girl friend Lulia still in India.

Lulia not break up with salman

Salman Khan, Lulia, salman lulia, Himesh Reshammiya Lulia, Lulia Video song, Lulia singer, Salman girl friend, Himesh Reshammiya new singer

Salman’s rumoured love Iulia to sing Hindi song for Himesh Reshammiya.

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ కాలేదా?

Posted: 11/26/2016 12:28 PM IST
Lulia not break up with salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రొమేనియన్ గర్ల్ ఫ్రెండ్ లులియా లు విడిపోయారంటూ ఈ మధ్య తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి విషయంలో మనస్పర్థలు రావటంతో హర్టయిన లూలియా వీసా రెన్యువల్ కూడా చేసేసుకుందని, ఇక ఇండియాకు తిరిగి రాకపోవచ్చనే అందులో పేర్కొన్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో తళుక్కుమని లూలియా షాక్ ఇవ్వటమే కాదు, కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తింది.

ఇదిలా ఉంటే లూలియా గురించి ఇప్పుడు మరో వార్త బయటికి వచ్చింది. త్వరలో బాలీవుడ్ లో ఓ పాట కూడా పాడబోతుందని తెలుస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ హిమేష్ రేష్మియా రూపొందించబోయే ఓ ఆల్బమ్ కోసం ఇప్పటికే వాయిస్ టెస్ట్ కూడా జరిగిపోయిందంట. ఈ విషయాన్ని హిమేషే స్వయంగా వెల్లడించాడు. ఆ మధ్య సల్మాన్ సుల్తాన్ సినిమాలోని జగ్ గుమియా పాటను లూలియా పాడిందంట. అది విన్న రేష్మియా ఇంప్రెస్ అయి లూలియాను సంప్రదించటం, ఆమె ఒప్పుకోవటం జరిగిపోయాయని చెబుతున్నాడు.

మోడల్ అయిన ఈ రొమేనియన్ బ్యూటీ పక్కా ప్రోఫెషనల్ సింగర్ లా పాటలు పాడుతుంటే తనకు షాక్ కలిగిందని హిమేష్ చెబుతున్నాడు. వచ్చే నెలలోనే ఈ పాటను రికార్డింగ్ చేయనున్నట్లు తెలిపాడు. అయితే ఆ వీడియో ఆల్బమ్ లో ఒక్క పాడటమేనా? లేక లూలియా నటిస్తుందా అన్న ప్రశ్న మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  girl friend  Lulia  singer avatar  Himesh Reshammiya  

Other Articles