కూతురి కారణంగానే విడిపోతున్నా... | Kamal Haasan and Gautami no longer together

Kamal haasan and gautami no longer together

kamal gautami relation end, Kamal hassan, Gautami Kamal hassan end, Kamal on relation with gautami, Gautami about Kamal, Kamal about gautamai, shruthi behind kamal gautami break up

Gautami Announces Separation From Kamal Haasan.

కమల్ నేను విడిపోతున్నాం-గౌతమీ

Posted: 11/01/2016 03:48 PM IST
Kamal haasan and gautami no longer together

స్టార్ హీరో కమల్ హాసన్, నటి గౌతమీ విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 ఏళ్ల పాటు సాగిన తమ సహ జీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి కాసేపటి క్రితమే స్వయంగా ప్రకటించింది. 2005 నుంచి కమల్, గౌతమీ కలిసే ఉంటున్నారు. ‘‘తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని’’ గౌతమి తెలిపారు.

సింపథీ కోసం తాను ఈ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ఆమె ప్రకటించింది. ఒక తల్లిగా తన బాధ్యతలు పెరిగిపోవటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పింది. సినీ పరిశ్రమకు రాకముందే కమల్‌ తన కలల హీరో అని గౌతమి కొనియాడారు. కమల్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు.

కాగా, సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన గౌతమీ తెలుగు అమ్మాయే. పశ్చిమగోదావరి లో పుట్టి, వైజాగ్ గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది. 1998లో ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ బాటియాను గౌతమీ పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మీ అనే సంతానం కూడా ఉంది. ఆపై అనివార్య కారణాలతో వారిద్దరు విడిపోయారు. ఇక అంతకు ముందే సన్నిహిత సంబంధాలు ఉన్న కమల్ కి గౌతమీ క్రమంగా దగ్గరయ్యింది.

అయితే గౌతమీకి బ్రెస్ట్ కాన్సర్ వచ్చినప్పుడు కమల్ ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అందుకే త్వరగా కోలుకున్నట్లు గౌతమీ ఓపెన్ గానే ప్రకటించింది. ఇక పెళ్లి మీద నమ్మకం లేకనే తాము లివింగ్ రిలేషన్ లో ఉంటున్నామని కూడా చాలా సార్లు ఇద్దరూ చెప్పారు. కాగా, కోలీవుడ్ లో పాపనాశనం(దృశ్యం తమిళ వర్షన్) తో చాలా గ్యాప్ తర్వాత గౌతమీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు తెలుగులో మోహన్ లాల్ సరసన మనమంతాలో నటించింది.

ఇక కమల్‌ భార్య సారికకు, గౌతమి తన భర్తకు దూరమయ్యాక.. ఇద్దరూ దగ్గరయ్యారు. వీరు విడిపోవటానికి సరైన కారణాలు తెలీనప్పటికీ, శృతీహాసన్ కోసమే ఇదంతా అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  gautami  relation  end  

Other Articles