బాహుబలి-2 ఫస్ట్ లుక్ రెడీ అయిపోండి | Set your clocks for the beginning of The Conclusion

Tiktak for baahubali 2 firstlook

Baahubali 2 firstlook, Baahubali The Conclusion Firstlook, Baahubali MIAMI first look, Baahubali Firstlook, Baahubali The Conclusion Firstlook out

Set your clocks for the beginning of Baahubali The Conclusion Firstlook.

బాహుబలి-2 ఫస్ట్ లుక్ కొద్ది గంటలే..

Posted: 10/21/2016 04:49 PM IST
Tiktak for baahubali 2 firstlook

ఇంకా కొద్ది గంటలే... దేశం మొత్తం బాహుబలి-ది కంక్లూజ్ ఫస్ట్ లుక్ సిద్ధమైపోతుంది. ముంబై వేదిక గా జరుగుతున్న మియామీ(MIAMI) 18వ మూవీ ఫెస్టివల్ లో దీనిని రిలీజ్ చేయనున్నారు. శనివారం సాయంత్రం రిలీజ్ కాబోయే ఫస్ట్ లుక్ కోసం దేశం మొత్తం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ది బిగినింగ్ కలెక్షన్ల సునామీ సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా కెపాసిటీని చాటింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతకు మించి సాధించాలని ప్రతీ తెలుగువాడు కోరుకుంటున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన భల్లాలదేవుడి మీద శివుడి ప్రతీకారం ఎలా ఉండబోతుంది? యుద్ధ సన్నివేశాలను ఇంకా ఎంత భారీగా తీయబోతున్నాడు వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది.  

కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు? అన్న ఒక్క టాపిక్ చాలూ ఈ సినిమా పాపులారిటీ ఏంటో తెలియజేయడానికి... ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా డిసెంబర్ చివరి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28న విడుదల కానుంది. ప్రభాస్ బర్త్ డే(అక్టోబర్ 23) కి ఒకరోజు రాబోతున్న ఈ గిప్ట్ ఎలా ఉంటుందోనని అభిమానుల ఎగ్జైట్ అవుతున్నారు. అభిమానుల్లారా... రెడీ గా ఉండండి. బాహుబలి-2 వచ్చేస్తోంది. టిక్..టాక్..టిక్..టాక్...

బాహుబలి సర్ ప్రైజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali2  firstlook  

Other Articles