అతనితో కేథరిన్ గొడవతోనే తీసేశారా? | Catherine out and Lakshmi Rai in for Chiranjeevi

Catherine out and lakshmi rai in for chiranjeevi

Catherine Tresa out from chiru movie, Chiru Item girl changed, Raai Laxmi Chiranjeevi, Chiru 150 item song

Catherine Tresa out and Lakshmi Rai in for Chiranjeevi.

కేథరిన్ బ్యాడ్ లక్ ఆమెకు కలిసొచ్చింది

Posted: 10/13/2016 08:11 PM IST
Catherine out and lakshmi rai in for chiranjeevi

చిరంజీవి కథానాయకుడిగా 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కేథరిన్ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలు కొంతకాలంగా వినిపించాయి. అయితే కేథరిన్ ప్లేస్ లో రాయ్ లక్ష్మీని ఎంపిక చేశారనేది తెలిసిందే. దీని వెనక ఉంది ఎవరో ఇప్పుడు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం చిరు ఫేవరెట్ డాన్స్ మాస్టర్ లారెన్స్ ని రంగంలోకి దించాడు దర్శకుడు వి వి వినాయక్. అయితే సెట్స్ లో కేథరిన్ కు, లారెన్స్ కు కాస్టూమ్స్ విషయంలో మనస్పర్థలు వచ్చాయంట. దీంతో ఆమె సెట్స్ నుంచి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఆపై లారెన్స్ కు బాగా దగ్గరైన లక్ష్మీ రాయ్ పేరు తెరపైకి తెచ్చి బలవంతంగా ఒప్పించాడంట.

అన్నట్లు 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ తో స్పెషల్ సాంగ్ చేసిన రాయ్ లక్ష్మీ, ఆ తరువాత చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్ చేయనుండటం విశేషం. చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి మాస్ ఆడియన్స్ కి మరింత హుషారెత్తించేదిలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెబుతున్నారు. అలా కేథరిన్ బాడ్ లక్ రాయ్ లక్ష్మీకి కలిసొచ్చిందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Raai Laxmi  Item Song  Chiru 150  

Other Articles